Hyderabad: ఉద్యోగం ఇస్తానని మోసం చేసిన వ్యక్తి, బుద్ది చెప్పేందుకు బాధితుడు చేసిన పనికి ఖంగుతిన్న పోలీసులు
వెంకటేశ్ డబ్బుల కోసం ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు మహిళలు శనివారం ఉదయం ఎలిజబెత్‌రాణిని ఆటోలో ఎక్కించుకుని బలవంతంగా మాణికేశ్వర్‌నగర్‌లోని తన ఇంటికి (Kidnapped) తీసుకెళ్లారు
Hyderabad, May 26: ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగి నుంచి ఒకరు రూ.4 లక్షలు వసూలు (Borrowed Money) చేశాడు. ఏడేండ్లు అయినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తమ డబ్బులు అయినా తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడి పెంచాడు. రేపు, మాపు అని తిప్పిస్తుండటంతో విసిగిపోయిన బాధితుడు తన కుటుంబసభ్యులతో కలిసి అతడి భార్యను కిడ్నాప్ చేశారు. తీసుకొన్న డబ్బులు ఇస్తేనే భార్యను వదులుతామని హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారం ఠాణా పరిధిలో శనివారం ఉదయం జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారం పోలీసుల జోక్యంతో సాయంత్రానికి సుఖాంతమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన మాగంటి లక్ష్మణరావుతో హైదరాబాద్‌కు చెందిన ఎలిజబెత్‌రాణికి 19 ఏండ్ల క్రితం వివాహమైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుందర్‌నగర్‌లో ఉంటున్న వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. ఎలిజబెత్‌రాణి స్థానిక ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు. భర్త లక్ష్మణరావు ఏడేండ్ల క్రితం ఓయూ ప్రాంతంలోని మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తికి ఉద్యోగం పెట్టిస్తానని చెప్పి రూ.3-4 లక్షలు తీసుకున్నాడు.
లక్ష్మణరావు చేస్తున్న దందా తెలుసుకున్న ఆ ఉన్నత ఉద్యోగి అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించాడు. వెంకటేశ్ డబ్బుల కోసం ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు మహిళలు శనివారం ఉదయం ఎలిజబెత్‌రాణిని ఆటోలో ఎక్కించుకుని బలవంతంగా మాణికేశ్వర్‌నగర్‌లోని తన ఇంటికి (Kidnapped) తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎలిజబెత్‌రాణి తన కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది. బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యా దు చేయగా, కేసు నమోదు చేశారు. వెంకటేశ్ ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించి సాయంత్రానికి బాధితురాలిని, నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇరువర్గాలు పోలీసుల అదుపులో ఉన్నారు. రాజీ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.