KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్
ఈ కేసులో ఏ1గా పట్నం నరేందర్ రెడ్డి పేరును చేర్చగా మరో 20 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే లగచర్లలో కుట్రకు వ్యూహరచన చేసినట్లు పేర్కొనడంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Hyd, Nov 14: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా పట్నం నరేందర్ రెడ్డి పేరును చేర్చగా మరో 20 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇక నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే లగచర్లలో కుట్రకు వ్యూహరచన చేసినట్లు పేర్కొనడంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేరుకోగా ఉదయం వరకు కేటీఆర్ ఇంట్లోనే హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేటీఆర్. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అని పేర్కొన్న కేటీఆర్...నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? చెప్పాలన్నారు. నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?, గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? చెప్పాలన్నారు. కలెక్టర్ పై దాడి కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి, కస్టడీపై పిటిషన్‌పై ఇవాళ కోర్టులో వాదనలు, కలెక్టర్‌పై దాడి బయటివారి పనేనని పోలీసుల వెల్లడి
Here's Tweet:
నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర?,పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! చెప్పాలన్నారు. మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? ,50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? అన్నారు.
నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! , నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి!..చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో అని సవాల్ విసిరారు.