Narnur Kamdev Jatara: ఆదిలాబాద్ లో ప్రారంభమైన నార్నూర్ కామ్ దేవ్ జాతర.. రెండు లీటర్ల నువ్వుల నూనెను క్షణాల్లో తాగేసిన ‘తొడసం’ ఆడపడుచు
ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకొనే ఈ జాతర తొడసం వంశీయుల పూజలతో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొడసం వంశీయురాలైన ఆడపడుచు మేస్రం నాగుబాయి చందు (52) రెండు లీటర్ల నువ్వుల నూనెను గటగటా తాగేశారు.
Adilabad, Jan 27: ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఉట్నూరు (Utnur) ఏజెన్సీలోని నార్నూర్ కామ్ దేవ్ జాతర (Narnur Kamdev Jatara) ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకొనే ఈ జాతర తొడసం వంశీయుల పూజలతో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొడసం వంశీయురాలైన ఆడపడుచు మేస్రం నాగుబాయి చందు (52) రెండు లీటర్ల నువ్వుల నూనెను గటగటా తాగేశారు. జాతరలో ఇలా నువ్వుల నూనె తాగడం ఆచారంగా వస్తోంది.
ఆడపడుచు హోదాలో ముందుకొచ్చే మహిళ వరుసగా మూడేళ్లపాటు ఈ జాతరలో నువ్వుల నూనె తాగాల్సి ఉంటుంది. ఇలా నూనె తాగడం వల్ల మంచి జరుగుతుందని తొడసం వంశీయులు నమ్ముతారు.