Yellow Alert for Telangana: తెలంగాణకు ఎల్లో అలర్ట్‌, ఈ నెల 18, 19 తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు, ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.

Rains (Photo-Twitter)

Hyd, August 16: ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 7 సెం.మీ కురిసింది.

ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్య సరిచేసిన జూనియర్ లైన్‌మెన్‌, స్వాతంత్ర్య దినోత్సవం రోజున సత్కరించిన సీఎం కేసీఆర్

ఈ ఏడాది నైరుతి సీజన్‌లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైంది. సాధారణం 46.6 సెం.మీ కాగా.. 68.2 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ ) తెలిపింది. జూన్‌ 1 నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో 21.6 సెం.మీ అధిక వర్షపాతం రికార్డయినట్టు వెల్లడించింది. హైదరాబాద్‌లో సాధారణం 363.3 మి.మీ కాగా, ఇప్పటి వరకు 450.1 మి.మీ వర్షపాతం నమోదైంది. మారేడ్‌పల్లి, చార్మినార్‌లో అత్యధికంగా 49 శాతం వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. ఎల్‌నినో సంవత్సరం అయినప్పటికీ తెలంగాణవ్యాప్తంగా అధిక వర్షం పడినట్టు పేర్కొన్నది.



సంబంధిత వార్తలు