Bike Stunts: బిజీ రోడ్డుపై వర్షంలో యువకుల బైక్‌ స్టంట్స్‌.. జారిపడి యువకుడు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియోతో)

సోషల్ మీడియాలో రీల్స్‌ చేసి ఫేమస్ అవడానికి, కొందరు యువకులు పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

Representational Image (Credits: Facebook)

Hyderabad, July 21: సోషల్ మీడియాలో రీల్స్‌ (Reels) చేసి ఫేమస్ అవడానికి, కొందరు యువకులు పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌ శివార్లలోని హయత్‌ నగర్‌ లో ఇలాంటి ఘటనే జరిగింది. జోరు వానలో హైదరాబాద్‌-విజయవాడ హైవేపై అంబర్‌ పేట వద్ద శనివారం ఇద్దరు యువకులు బైక్‌ పై రివ్వుమని దూసుకెళ్తూ స్టంట్స్‌ చేస్తున్నారు. శివ అనే  బైకర్‌ స్టంట్‌ (Bike Stunts) చేస్తుండగా మరో బైక్‌ పై ఉన్న యువకులు వీడియో తీస్తున్నారు.

రోగం తగ్గిస్తానని యువతి తలలోకి 77 సూదులు గుచ్చిన మాంత్రికుడు.. తలనొప్పితో దవాఖానలో చేరిన యువతి.. టెస్టుల్లో బయటపడ్డ దారుణం.. ఒడిశాలో జరిగిన ఈ ఉదంతంలో తర్వాత ఏం జరిగింది? 

స్టంట్స్‌ చేస్తున్న క్రమంలో..

స్టంట్స్‌ చేస్తున్న క్రమంలో బైక్‌ పై నుంచి అదుపుతప్పి శివ కిందపడిపోయింది. అతనితో పాటు వెనుకాల కూర్చున్న మరోవ్యక్తి కూడా పడిపోయాడు. వీరిలో శివ మరణించగా.. ఇంకో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి.. ఎలా జరిగిందంటే??

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement