Representational Image (Photo Credits: File Photo)

Hyderabad, Feb 18: హైద‌రాబాద్ ఓఆర్ఆర్‌ పై రెండు కార్ల‌తో స్టంట్(Car Stunts) చేసిన ఇద్ద‌రు వ్య‌క్తులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ (Police Arrest) చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైద‌రాబాద్ ఓఆర్ఆర్‌ పై ఇటీవల ల‌గ్జ‌రీ ఎస్‌యూవీ కారుల్లో ఇద్ద‌రు వ్యక్తులు రింగు రోడ్డుపై స్టంట్ చేశారు. ఫార్చూన‌ర్‌, బీఎండ‌బ్ల్యూ కార్ల‌తో వాళ్లు చ‌క్క‌ర్లు కొట్టారు. ఆ స్టంట్ అక్క‌డ ఉన్న సీసీటీవీ కెమెరాల‌కు చిక్కింది. ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయిదు లేన్ల రోడ్డుపై వాళ్లు ఆ స్టంట్ ప‌ర్ఫార్మ్ చేశారు. ల‌గ్జ‌రీ కార్ల‌తో స్టంట్ చేసిన విద్యార్థుల్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించాలనుకునే భక్తులకు అలర్ట్.. మే నెలకు సంబంధించి కోటా వివరాలు ఇవిగో..!

అరెస్ట్ అయింది వీళ్లే..

రాజేంద్ర‌న‌గ‌ర్‌ కు చెందిన 25 ఏళ్ల మొహ‌మ్మ‌ద్ అబ్దుల్లా, మ‌ల‌క్‌ పేట‌కు చెందిన 25 ఏళ్ల‌ జోహెయిర్ సిద్ధిక్‌ గా గుర్తించారు. ల‌గ్జ‌రీ కార్ల‌ను కూడా సీజ్ చేశారు.

రన్ వేపై ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన 18 మంది ప్రయాణికులు.. కెనడాలో ఘటన.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

బీహార్ లో ఇలాంటిదే

బీహార్ లోని పాట్నా హైవేలో భయానక స్టంట్స్ కు ప్రయత్నించిన యువకులకు ఇటీవల తృటిలో ప్రమాదం తప్పింది. పాట్నా హైవేలో  రెండు వాహనాల మధ్యలో నుంచి ప్రమాదకరంగా వెళ్లడానికి ఈ ద్విచక్ర వాహనదారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో  కారును ఢీకొట్టి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి.