
Hyderabad, Jan 27: హైదరాబాద్ లో (Hyderabad) పెరిగిన ట్రాఫిక్ (Traffic) రద్దీ, ఇరుకైన రోడ్లు వెరసి రోజూ రోడ్డు ప్రమాదాలు (Road Accidents) నిత్యకృత్యంగా మారాయి. ప్రమాదాల నివారణకు అటు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఇరుకు రోడ్లు, విపరీతంగా పెరిగిన వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన వలన ఈ ప్రమాదాలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లోని మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
స్కూల్ లో తన కూతురు(10)ను డ్రాప్ చేయడానికి యాక్టివా పైన తండ్రి ఆమెను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి లారీ యాక్టివాను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ కిందపడి కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రికి స్వల్ప గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం
స్కూల్లో కూతురు(10)ను డ్రాప్ చేయడానికి యాక్టివా పైన తండ్రి తీసుకెళ్తుండగా ప్రమాదం
వేగంగా వచ్చి యాక్టివాను ఢీకొట్టిన లారీ
లారీ కిందపడి కూతురు అక్కడికక్కడే మృతి.. తండ్రికి స్వల్ప గాయాలు pic.twitter.com/3jDe9p4t5r
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2025
మైనర్లకు ఇలా..
ఇక, మైనర్ల (Minors) చేతికి వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. పెద్దవారు చేసే ఇలాంటి తప్పిదాలతో పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ (Aramghar Flyover)పై ఓ బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.
సోమవారం అర్ధరాత్రి రాత్రి ఒంటి గంటకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన ముగ్గురు మైనర్ బాలురుగా పోలీసులు (Police) గుర్తించారు. బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కూటీ ప్రమాదానికి గురైనట్టు తెలిపారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.