
London, Jan 28: పని గంటల (Working Hours) విషయమై భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో బ్రిటన్ (Britain) లోని దాదాపు 200 కంపెనీలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి. వారానికి నాలుగు పని దినాలను అమలు చేస్తున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించాయి. ఎలాంటి శాలరీ కటింగ్ లేకుండా పర్మినెంట్ గా ఈ విధానం అమలు చేస్తున్నట్టు చెప్పాయి. ఈ మేరకు పలు మార్కెటింగ్, టెక్నాలజీ, ఛారిటీలు సహా 200 సంస్థలు ఈ విధానంలోకి మారినట్లు యూకే మీడియా కథనాలు పేర్కొన్నాయి. '4 డే వీక్ ఫౌండేషన్' చేసిన సర్వేలో భాగంగా ఈ విషయం వెల్లడైనట్టు వివరించాయి.
200 UK companies sign up for a permanent four-day working week
Together the companies employ more than 5,000 people, with charities, marketing and technology firms among the best-represented, according to the latest update from the 4 Day Week Foundation https://t.co/cYsyQZVKyl
— Socialist Voice (@SocialistVoice) January 27, 2025
ఎంత మందికి లబ్ధి?
వారానికి నాలుగు పని దినాల నిర్ణయంతో ఆయా కంపెనీలలో పని చేస్తున్న సుమారు 5 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని మీడియా సంస్థలు తెలిపాయి.
మొదట యూకేలోని కంపెనీలే
వారానికి 4 రోజుల పని దినాలను మొదట యూకేలోని సుమారు 30 మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, మీడియా సంబంధిత సంస్థలు అమలు చేశాయి. ఇప్పుడు 24 ఐటీ, టెక్నాలజీ, 29 ఛారిటీలు, 22 మేనేజ్ మెంట్, కన్సల్టింగ్ కంపెనీలు కూడా ఇదే విధానంలో చేరినట్లు తాజాగా సర్వేలో వెల్లడైంది. లండన్ లో అత్యధికంగా 59 సంస్థలు ఈ కొత్త పని విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిసింది.