Numaish Last Day Today: హైదరాబాద్ నుమాయిష్ నేడే ఆఖరు.. శనివారం నాటికి దాదాపు ఇరవై లక్షలు దాటిన సందర్శకుల సంఖ్య
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) నేడు ఆదివారం ముగియనుంది.
Hyderabad, Feb 18: నాంపల్లి (Nampally) ఎగ్జిబిషన్ (Exibition) మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) (Numaish) నేడు ఆదివారం ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ప్రతి యేట జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు. ఈ సారి స్టాల్ హోల్డర్స్ విజ్ఞప్తి మేరకు నుమాయిష్ ను మూడు రోజులు పెంచుతున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. దీంతో 18వ తేదీన నుమాయిష్ ముగియనుంది.