6G in India: 6జీ సేవలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, ఈ దశాబ్ధం చివరినాటికి దేశంలో 6జీ ప్రారంభమవుతుందని వెల్లడి, అక్టోబర్ 12 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి..
దేశంలో 6జీ సర్వీసులపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ దశాబ్ధం చివరినాటికి దేశంలో 6జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు సాగుతోందని ప్రధాని వెల్లడించారు.
దేశంలో 6జీ సర్వీసులపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ దశాబ్ధం చివరినాటికి దేశంలో 6జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు సాగుతోందని ప్రధాని వెల్లడించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఈవెంట్‌లో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.గేమింగ్, వినోద రంగాల్లో భారత సొల్యూషన్స్ కోసం ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. ఇక అంతకుముందు 5జీ సేవలు అక్టోబర్ 12 నాటికి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామని టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.
టెలికాం ఆపరేటర్లు ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని, ఇన్‌స్టలేషన్స్ జరుగుతున్నాయని చెప్పారు. అక్టోబర్ 12 నాటికి 5జీ సేవలు షురూ అవుతాయని, ఆపై దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలకు విస్తరిస్తాయని అన్నారు. తొలుత హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూర్, గురుగ్రాం, లక్నో, కోల్‌కతా, ముంబై సహా 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.