Nokia-Airtel Deal: ఇండియాలో 5జీ కోసం రూ.7,636 కోట్ల డీల్, నోకియాతో భారతి ఎయిర్‌టెల్ భారీ ఒప్పందం, 2022 వరకు భారత్‌లో 3 లక్షల కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటు చేయడమే లక్ష్యం
ఇండియాలో దూసుకుపోతున్నటెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తో భారీ ఒప్పందాన్ని (Nokia-Airtel Deal) చేసుకుంది.1 బిలియన్ డాలర్ల (రూ.7,636 కోట్లు) విలువైన ఒప్పందాన్ని నోకియా (Nokia) మంగళవారం ప్రకటించింది. ఎయిర్‌టెల్ (Airtel) కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ డీల్ ద్వారా దేశంలో వినియోగదారులకు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
April 28: ప్రముఖ మొబైల్ దిగ్గజం, ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా ఇండియాలో దూకుడు పెంచింది. ఇండియాలో దూసుకుపోతున్నటెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తో భారీ ఒప్పందాన్ని (Nokia-Airtel Deal) చేసుకుంది.1 బిలియన్ డాలర్ల (రూ.7,636 కోట్లు) విలువైన ఒప్పందాన్ని నోకియా (Nokia) మంగళవారం ప్రకటించింది. ఎయిర్‌టెల్ (Airtel) కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ డీల్ ద్వారా దేశంలో వినియోగదారులకు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జియోలో 9.9 శాతం వాటాను కొనేసిన ఫేస్‌బుక్, డీల్ విలువ రూ. 43,574 కోట్లు, కొనుగోలుతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై తగ్గనున్న అప్పుల భారం
2022 వరకు భారత్‌లో 3 లక్షల కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నోకియా, ఎయిర్‌టెల్‌లు కలిసి పనిచేయనున్నామని నోకియా ఒక ప్రకటనలో తెలిపింది. 4జీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతో పాటు, 5జీ సామర్థ్యాలనుపెంచే ప్రయత్నంలోఎయిర్‌టెల్ చెందిన దేశంలోని తొమ్మిది సర్కిల్‌లలో ఈడీల్ చేసుకుంది. 1.3 బిలియన్ల జనాభాతో, ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెలికాం మార్కెట్ భారతదేశంలో ఆన్‌లైన్ డిమాండ్ పెరిగేకొద్దీ రానున్న ఐదేళ్లలో మొబైల్ వినియగదారుల సంఖ్య 920 మిలియన్లకు పెరుగుతుందని నోకియా అంచనా వేస్తోంది.
25 ఏళ్ల పాటు సేవలందించిన నోకియా ప్రెసిడెంట్, సీఈవో పదవికి భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఆయన స్థానంలో పెక్కా లుండామర్క్ పేరును కంపెనీ ఖరారు చేసింది. కాగా నోకియా 2015 తరువాత 2019 ఏడాదిలో మొదటిసారి లాభాలను నమోదు చేసింది. 7 మిలియన్ యూరోల లాభంతో అంచనాలను అధిగమించింది.