Google Alert: ఈ ఫోన్లకు గూగుల్ సర్వీసులు అన్నీ బంద్, వెంటనే వారు తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని అలర్ట్ మెసేజ్ జారీ చేసిన గూగుల్
ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్ (Android version 2.3) లేదా అంతకంటే తక్కువ వెర్షన్‌తో నడుస్తోన్న స్మార్ట్ ఫోన్‌లలో (All Google Services Blocked in Old Android Version) గూగుల్ సేవలు ఆపేస్తున్నామని తెలిపింది. ఈ ఫోనన్ వినియోగదారులు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని కోరింది.
గూగుల్ తన వినియోగదారులకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్ (Android version 2.3) లేదా అంతకంటే తక్కువ వెర్షన్‌తో నడుస్తోన్న స్మార్ట్ ఫోన్‌లలో (All Google Services Blocked in Old Android Version) గూగుల్ సేవలు ఆపేస్తున్నామని తెలిపింది. ఈ ఫోనన్ వినియోగదారులు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని కోరింది.
అప్ డేట్ చేసుకోకుంటే గూగుల్ సెర్చ్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, ఇతర గూగుల్ సేవలను పొందలేరని(యాప్స్ ద్వారా) గూగుల్ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 27 నుంచి 2.3 వెర్షన్ డివైజ్‌లలో ఆయా గూగుల్ యాప్స్‌లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎర్రర్ వస్తుంది. అది కరెక్ట్ మెయిల్, పాస్‌వర్డ్ అయినా సరే పనిచేయడం లేదు.యూజర్ల భద్రత, డాటా పరిరక్షణ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం డివైజ్ తయారీదారులు చాలాకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
అయినప్పటికీ గూగుల్ మొండిగా ముందుకు పోతోంది. అయితే ఆ ఫోన్ బ్రౌజర్లో మాత్రం ఈ సర్వీసులను యూజర్లు పొందే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఫోన్ సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేయమని లేదా ఫోన్‌లనే మార్చేయమని గత కొంతకాలంగా గూగుల్, యూజర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది. గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఈ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను కల్గి ఉన్న స్మార్ట్‌ఫోన్లను కొత్త ఫోన్లతో రిప్లేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఈరోజుల్లో ఆండ్రాయిడ్ 3.0 వెర్షన్.. అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ వెర్షన్స్‌నే వాడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఒకవేళ వాడుతుంటే గనుక తక్షణమే ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్(అప్‌గ్రేడ్) చేస్కోమని సూచిస్తోంది.