Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ వ‌చ్చేసింది..వీటిపై భారీ త‌గ్గింపు, ఎస్బీఐ క్రెడిడ్ కార్డు ఉందా? అయితే మీకు పండుగే!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 (Amazon Great Indian Festival 2024) సేల్‌ను ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్‌కు ముందు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం సేల్ వివరాలను వెల్లడించింది

Amazon Logo (Photo Credit: Wikimedia Commons)

New Delhi, SEP 12: కొత్త మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లు, ఇతర గాడ్జెట్లు ఏమైనా కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 (Amazon Great Indian Festival 2024) సేల్‌ను ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్‌కు ముందు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం సేల్ వివరాలను వెల్లడించింది. అయితే, సేల్ కచ్చితమైన తేదీలు ఇంకా వెల్లడించలేదు. అమెజాన్ (Amazon) వెబ్‌సైట్‌లో కొన్ని ముందస్తు డీల్స్, డిస్కౌంట్లను కూడా టీజ్ చేస్తోంది. కొనుగోలుదారులు ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు, ఎలక్ట్రానిక్స్, అప్లియన్సెస్‌పై 75 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అదనంగా, అమెజాన్ ప్రైమ్ సభ్యులు, ఎస్‌బీఐ కార్డ్ వినియోగదారులు అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

Here's Tweet

 

అమెజాన్ ఇతర ప్రొడక్టులతో పాటు ఎలక్ట్రానిక్స్, అప్లియన్సెస్, మొబైల్‌లు, గేమింగ్ డివైజ్‌ల వంటి వివిధ ప్రొడక్టులపై భారీ తగ్గింపులను సూచించే ప్రత్యేక మైక్రోసైట్‌ను రూపొందించింది. ఆపిల్, శాంసంగ్, డెల్, అమెజాఫిట్, సోనీ, షావోమీ వంటి గ్లోబల్ బ్రాండ్‌ల నుంచి ఫోన్లు గణనీయమైన ధర తగ్గింపులను అందుకోనున్నాయి. అదనంగా, బోట్ వంటి భారతీయ బ్రాండ్‌ల ప్రొడక్టులపై కూడా భారీ తగ్గింపులు పొందవచ్చు. అమెజాన్ సేల్ (Amazon Sale) సమయంలో అలెక్సా, ఫైర్ టీవీ, కిండ్ల్ డివైజ్‌ల వంటి ప్రొడక్టుల శ్రేణిపై తక్కువ ధరకే పొందవచ్చు.

Motorola Razr 50: మోటరోలా రేజర్ 50 వచ్చేసింది, ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇవిగో.. 

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) భాగస్వామ్యంతో ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లు ప్రొడక్టులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. టాబ్లెట్‌లపై 60 శాతం వరకు, మొబైల్‌లు, అప్లియన్సెస్‌పై 40 శాతం వరకు, హెడ్‌ఫోన్‌లపై 70 శాతం వరకు, స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్‌లపై 60 శాతం వరకు తగ్గింపు, 70 శాతం వరకు ఆఫర్‌లను అందించే డీల్‌ బెనిఫిట్స్ పొందవచ్చు. గేమింగ్ కన్సోల్‌లు మరిన్నింటిపై తగ్గింపుతో పాటు ఎలక్ట్రానిక్స్‌, విమాన టిక్కెట్లు, రైలు, బస్సు ఛార్జీలు, హోటల్ బుకింగ్‌లతో సహా ప్రయాణ బుకింగ్‌లపై కూడా కస్టమర్లు డిస్కౌంట్ పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది.

iPhone 16 Series: యాపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్.. ధరల శ్రేణి, ఫీచర్స్, బుకింగ్స్ ఇతరత్రా వివరాలు ఇడిగో..! 

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ (Amazon Prime Membership) ఉన్న కస్టమర్‌లు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌కి ముందస్తు యాక్సెస్ పొందవచ్చు. అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, ఎక్స్‌టెండెడ్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉంటాయి. ఇంకా, అమెజాన్ పే, పే లేటర్ ఆధారిత పేమెంట్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు కూడా సేల్ సమయంలో లైవ్‌లో ఉంటాయని భావిస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif