Apple iPhone 16 (Credits: X)

Newdelhi, Sep 10: అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) కంపెనీ సోమవారం త‌న కొత్త ఐఫోన్ 16 సిరీస్ (iPhone 16 Series) ఫోన్ల‌ను విడుదల చేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, పెద్ద సైజు డిస్‌ ప్లే, ప్రో-కెమెరా ఫీచర్లు, మెరుగుపడిన బ్యాటరీ లైఫ్ వంటి ఎన్నో ఫీచ‌ర్ల‌తో ఈ కొత్త ఫోన్ల‌ను తీసుకువ‌చ్చింది. ఏ18 ప్రో చిప్‌ తో ప‌నిచేసే ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ లు కొత్త 48ఎంపీ ఫ్యూజన్ కెమెరా కలిగిఉన్నాయి.  డాల్బీ విజన్‌లో 4కే120 ఎఫ్‌పీఎస్‌ వీడియో రికార్డింగ్ చేసుకునే వెసులుబాటు ఉన్నది.

రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ మార్కెట్లోకి వచ్చేసింది, ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..

ఈ రంగుల్లో అందుబాటులో

ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ బ్లాక్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం, డెజర్ట్ టైటానియం రంగులలో అందుబాటులో ఉంటాయి. 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ వెర్షన్ల‌లో లభిస్తాయి ఇక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్ల‌స్‌ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీలలో అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటాయి.

మోటరోలా రేజర్ 50 వచ్చేసింది, ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇవిగో..

ధరల శ్రేణి

ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 119,900. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ ప్రారంభ ధర రూ. 144,900. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900, ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.89,900గా కంపెనీ నిర్ణయించింది.

ఎప్పటి నుంచి అందుబాటులోకి..

ఇండియాలోని వినియోగదారులు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ ల‌కు సంబంధించి వచ్చే శుక్రవారం నుంచి ముంద‌స్తు బుకింగ్‌ లు చేసుకోవ‌చ్చు. సెప్టెంబర్ 20 నుంచి ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ 16 ముంద‌స్తు బుకింగ్‌ లు సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అలాగే సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొంది.