Apple Stores in India: ప్రధాని మోదీతో టిమ్ కుక్ భేటి కానున్నట్లు వార్తలు, తొలిసారిగా భారత్‌లో రెండు రిటైల్‌ స్టోర్లను ప్రారంభించనున్న యాపిల్

మరికొన్ని రోజుల్లో భారత్‌లో తొలి రిటైల్‌ స్టోర్‌ (retail store)ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు చెప్పింది

Tim Cook (Photo Credits : Wikimedia Commons)

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) భారత్‌లోని తన కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మరికొన్ని రోజుల్లో భారత్‌లో తొలి రిటైల్‌ స్టోర్‌ (retail store)ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు చెప్పింది. ఏప్రిల్ 18న ముంబైలో, 20వ తేదీన ఢిల్లీలో యాపిల్ స్టోర్స్‌ను టిమ్ కుక్ ఓపెనింగ్ చేయ‌నున్నారు.ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌ (Jio World Drive Mall)లో ఉదయం 11 గంటలకు టెక్ దిగ్గజం తొలి అధికారిక రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానుంది.

దేశంలో ఏఐ టెక్నాలజీకి ఎటువంటి చట్టాన్ని తీసుకురావడం లేదు, లోక్‌సభలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ముంబై తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో రెండో యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ సాకెట్‌లోని సెలెక్ట్‌ సిటీవాక్‌ మాల్‌లో ఏప్రిల్‌ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ పర్యటనలో ఆపిల్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ (Apple Inc. Chief Executive Officer Tim Cook) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.