Google Chrome Browser: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో అనేక లోపాలు, వెంటనే కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ హెచ్చరిక, ఎలా అప్‌డేట్ చేసుకోవాలని ఇక్కడ చూడండి
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌లో తీవ్రమైన సమస్య (Center has a warning) ఉన్నట్లు తెలిపింది.
గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌లో తీవ్రమైన సమస్య (Center has a warning) ఉన్నట్లు తెలిపింది. CERT-In ప్రకారం గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్‌లో అనేక లోపాలు ఉన్నాయని, ఈ లోపాల సాయంతో యూజర్లపై సైబర్ దాడులు సులువుగా జరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
గూగుల్ క్రోమ్ V8 టైప్ కన్ఫ్యూజన్ కారణంగా అనేక సమస్యలను ఉన్నట్లు తేలింది. దీంతో హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత డేటాకు యాక్సెస్ పొందవచ్చని, వారిని లక్ష్యంగా చేసుకొని కంప్యూటర్‌లో మాల్వేర్‌ను పంపేందుకు సులువుగా ఉంటుందని సెర్ట్-ఇన్ (Government's Computer Emergency Response Team (CERT-In) తెలిపింది. ఇక గూగుల్ క్రోమ్ వెబ్‌బ్రౌజర్‌లో (Google Chrome Browser) సమస్యలు ఉన్నట్లు గూగుల్ కూడా గుర్తించింది. వెంటనే నివారణ చర్యలను కూడా చేపట్టింది. గూగుల్ క్రోమ్ అప్‌డేట్‌డ్ వెర్షన్‌ను విడుదల చేసింది.
యూజర్లు వీలైనంత త్వరగా క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. సుమారు 22 రకాల భద్రతా పరిష్కారాలను అందించినట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తెలిపింది.గూగుల్ ఇటీవల ప్రకటించినట్లుగా విండోస్, మ్యాక్, లైనెక్స్ కోసం విస్తృతంగా ఉపయోగించే క్రోమ్ బ్రౌజర్ వెర్షన్‌ను 96.0.4664.93 రిలీజ్ చేసింది.
మీ క్రోమ్ బ్రౌజర్‌ని ఇలా అప్‌డేట్ చేయండి
• Google Chrome బ్రౌజర్‌ని ఒపెన్ చేయండి.
• కుడి ఎగువ మూలలో, మూడు చిన్న చుక్కలపై క్లిక్ చేయండి
•హెల్ఫ్‌పై క్లిక్ చేయండి. మీకు బ్రౌజర్ వెర్షన్‌ను చూపుతుంది. అప్‌డేట్ అప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇలా కాకుండా మీరు నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి..మై యాప్స్‌లో గూగుల్ క్రోమ్‌పై క్లిక్ చేసి అప్‌డేట్ అప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.