Asus New Laptops: రూ. 50 వేల ప్రారంభ ధరతో ఏసూస్ నుంచి ఎకో ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు భారత మార్కెట్‌లో విడుదల, ఒకటి Zenbook S13 OLED, మరొకటి Vivobook 15, వీటి ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి!

Asus Zenbook S13 OLED and Vivobook 15 launched : PIc- Asus India Official

Asus New Laptops: తైవాన్‌కు చెందిన కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ ఏసూస్ తాజాగా రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. Zenbook S13 OLED మరియు Vivobook 15 అనే పేర్లతో విడుదలైన ఈ ల్యాప్‌టాప్‌లు రూ. 50 వేల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇందులో Vivobook 15 అనేది బేస్ వేరియంట్ ల్యాప్‌టాప్‌ కాగా, Zenbook S13 OLED అనేది టాప్ వేరియంట్ ల్యాప్‌టాప్‌.

కంపెనీ ప్రకారం, ఈ రెండు ల్యాప్‌టాప్‌లు పర్యావరణ స్పృహతో రూపొందించబడినవి. తేలికపాటి బరువు, నాజూకైన డిజైన్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లను ఎక్కడికైనా మోసుకెళ్లగలగడం కూడా సులభంగా, సౌకర్యంగా ఉంటుంది.

మెరుగైన పనితీరు, అద్భుతమైన సామర్థ్యంతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Asus Vivobook 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

అదనంగా, పోర్ట్‌లు 3.2 Gen 1 (Type-C), USB 3.2 Gen 1, USB 2.0, HDMI 1.4 మరియు 3.5mm కాంబో ఆడియో జాక్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ ల్యాప్‌టాప్ Wi-Fi 6Eని కూడా కలిగి ఉంది. ఏసూస్  వివోబుక్ 15 ల్యాప్‌టాప్‌ 17.9 మిమీ మందంతో బరువు 1.7 కిలోలు ఉంటుంది.

ప్రారంభ ధర రూ. 49,900/-

Asus Zenbook S13 OLED స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

అదనంగా, కనెక్టివిటీ ఆప్షన్‌లలో థండర్‌బోల్ట్ 4 USB-C, HDMI 2.1, మరియు USB 3.2 Gen 2 టైప్-A, అలాగే వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి Wi-Fi 6E ఉన్నాయి. ఏసూస్  Zenbook S13 OLED ల్యాప్‌టాప్‌ 10.9 మిమీ మందంతో బరువు 1 కిలో ఉంటుంది.

ప్రారంభ ధర రూ. 1,29,990/-