Bank Holidays In January 2024: జనవరి నెలలో ఏకంగా 16 సెలవులు, ఇవి తెలుసుకోకుండా బ్యాంకుకు వెళ్తే ఇక అంతే! రాష్ట్రాల వారీగా బ్యాంకు పనిదినాల లిస్ట్ ఇదుగో..
రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు, జాతీయ సెలవు దినాలు, పండుగలకు సెలవులు ప్రకటించారు.
Mumbai, DEC 31: చరిత్ర కాల గర్భంలో మరో వసంతం కలిసిపోతున్నది. యావత్ మానవాళి నూతన సంవత్సరం 2024కు స్వాగతం (New Year Celebrations) పలుకుతోంది. కొత్త వసంతంలో ఆర్థికంగా మరింత బల పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, గతంతో పోలిస్తే ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా నిర్వహిస్తుంటారు. దాదాపు అన్ని చెల్లింపులూ డిజిటలైజ్ అయినా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఖాతాదారులు తమ బ్యాంకు శాఖలను సంప్రదించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి క్షణమూ విలువైనదే.. కనుక బ్యాంకు శాఖకు (Holiday List)వెళ్లాల్సి వస్తే ముందుగా బ్యాంకులకు సెలవులు (Bank Holidays In January ) ఎప్పుడో చెక్ చేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే 2024 జనవరిలో జాతీయ, ప్రాంతీయ సెలవులు కలుపుకుని మొత్తం 16 రోజులు బ్యాంకులకు సెలవులు. రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు, జాతీయ సెలవు దినాలు, పండుగలకు సెలవులు ప్రకటించారు.
జనవరి 2024లో బ్యాంకు సెలవులు ఇలా ఉన్నాయి
జనవరి 1 (సోమవారం) – నూతన సంవత్సరాది – ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్ టక్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమ, షిల్లాంగ్
జనవరి 2 (మంగళవారం) – నూతన సంవత్సరాది – ఐజ్వాల్
జనవరి 7 (ఆదివారం) – దేశమంతా వారాంతపు సెలవు
జనవరి 11 (గురువారం) - మిషనరీ డే -ఐజ్వాల్
జనవరి 13 (శనివారం) – రెండో శనివారం- జాతీయ సెలవు
జనవరి 14 (ఆదివారం) – జాతీయ సెలవు
జనవరి 15 (సోమవారం) మకర సంక్రాంతి – బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్ టక్, గువాహటి, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్
జనవరి 16 (మంగళవారం) – తిరువల్లూర్ డే – చెన్నై
జనవరి 17 (బుధవారం)- ఉజ్వల్ తిరునాళ్లు, శ్రీ గురు గోవింద్ జింగ్ జయంతి – చండీగఢ్, చెన్నై
జనవరి 21 (ఆదివారం) – వారాంతపు జాతీయ సెలవు
జనవరి 22 (సోమవారం) - ఇమైనొ ఇరట్పా -ఇంఫాల్
జనవరి23 (మంగళవారం) – గాన్-న్ఘాయి – ఇంఫాల్
జనవరి 25 (గురువారం) – థాయి పూసం, మహ్మద్ హజరత్ అలీ – చెన్నై, కాన్పూర్, లక్నో
జనవరి 26 (శుక్రవారం) - గణతంత్ర దినోత్సవం – అగర్తల, డెహ్రాడూన్, కోల్‌కతా మినహా దేశమంతా సెలవు.
జనవరి 27 (శనివారం) – నాలుగో శనివారం – జాతీయ వారాంతపు సెలవు దినం.
జనవరి 28 (ఆదివారం) – జాతీయ వారాంతపు సెలవు.