Sunil Mittal: మొబైల్ యూజర్లకు భారీ షాక్, త్వరలో మోగనున్న మొబైల్ ఛార్జీల ధరలు, రాబోయే ఆరు నెలల్లో డేటా ధరలు పెరుగుతాయని తెలిపిన భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్
రానున్న ఆరు నెలల్లో మొబైల్ చార్జీల ధరలు పెరగనున్నాయని (mobile services rate hike) టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ (Bharti Airtel chairman Sunil Mittal) సంకేతాలను సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆరు నెలల్లో మొబైల్ చార్జీల మోత (mobile services prices) తప్పదని అంటున్నారు. తక్కువ డేటా ధరలతో టెలికాం పరిశ్రమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయన్నారు.
త్వరలో మొబైల్ సేవల చార్జీల మోత మోగనుంది. రానున్న ఆరు నెలల్లో మొబైల్ చార్జీల ధరలు పెరగనున్నాయని (mobile services rate hike) టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ (Bharti Airtel chairman Sunil Mittal) సంకేతాలను సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆరు నెలల్లో మొబైల్ చార్జీల మోత (mobile services prices) తప్పదని అంటున్నారు. తక్కువ డేటా ధరలతో టెలికాం పరిశ్రమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం భారత్‌లో రూ.160కే నెలకు 16 జీబీ లభించడం కంపెనీలకు బాధాకర అంశం అని సునీల్ మిట్టల్ అన్నారు. 5జీ టెక్నాలజీని అందింపుచ్చుకోవడానికి పెట్టుబడుల కోసం.. టెలికాం సంస్థలు ఎదురు చూస్తున్నాయని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు.
తక్కువ రేటుతో డేటా సేవలను అందించడం సాధ్యం కాదని, తక్కువ ధరకు డేటా ఇవ్వడం వల్ల టెలికాం పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉందని మిట్టల్ అందోళన వ్యక్తం చేశారు. నెలకు1.6 జీబీ వినియోగానికి అలవాటు పడాలి లేదా ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే చాలా ఎక్కువ చెల్లించడానికి సిద్ధం కావాల్సిందేనని మిట్టల్ వ్యాఖ్యానించారు. అమెరికా యూరప్ లో లాగా 50-60 డాలర్లు కాకపోయినా, ఖచ్చితంగా నెలకు 160 రూపాయలకు 16జీబీ వినియోగం మాత్రం ఒక విషాదమే అని తేల్చి చెప్పారు. రూ.400 ఒక్కసారి ఖర్చు పెడితే 56 రోజులు వరకు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, అపరిమిత కాల్స్, 1.5 జీబీ రోజువారీ డేటా.. ఈ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ సెలక్ట్ చేసుకోండి
ఆరు నెలల కాలంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్‌పీయూ) 200 రూపాయలు దాటొచ్చని అంచనా వేశారు. భారతీ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన పుస్తకం విడుదల సందర్భంగా మిట్టల్ ఈ వ్యాఖ్యలు చేశారు. డేటా కోసం అయితే 100 సరిపోతుంది కానీ టీవీ, మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ లాంటి చూడాలంటే మాత్రం వాటికి కస్టమర్ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమకు 300 ఏఆర్పీయూ కావాల్సిందేనని మిట్టల్ పేర్కొన్నారు. జియో నుంచి రెండు సరికొత్త ప్లాన్లు, క్రికెట్ అభిమానుల కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితం, ఆఫర్లపై ఓ లుక్కేయండి
కష్ట కాలంలో కూడా టెలికాం ఆపరేటర్లు దేశానికి సేవ చేశారని, అలాగే 5జీ, ఆప్టికల్ ఫైబర్స్, సబ్ మెరైన్ కేబుల్స్ లో పెట్టుబడులు పెట్టాల్సి ఉందని మిట్టల్ వెల్లడించారు. కేవలం 2-3 ఆపరేటర్లతో సంక్షోభంలో పడిన పరిశ్రమ స్థిరంగా కొనసాగాలంటే రాబోయే 5-6 నెలల్లో ఖచ్చితంగా 200-250 మార్కును దాటాల్సిందేనని మిట్టల్ వెల్లడించారు. టెలికాం వ్యాపారం డిజిటల్ బాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు.