Binny Bansal Resigns: ఫ్లిప్ కార్ట్ కు షాక్, బోర్డు నుంచి వైదొలిగిన కో ఫౌండర్ బిన్నీ బన్సల్, కొత్త వ్యాపారం మొదలు పెట్టేందుకే బయటకు వచ్చారని టాక్
ఇటీవల తాను సొంతంగా ‘ఓప్ డోర్ (OppDoor)’ అనే పేరుతో ఈ-కామర్స్ వెంచర్ బిజినెస్ ప్రారంభించిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.బిన్నీ బన్సల్ రాజీనామాను (Binny Bansal Resigns) ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.
New Delhi, JAN 27: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆ సంస్థ కో-పౌండర్ బిన్నీ బన్సల్ (Binny Bansal Resigns) వైదొలిగారు. ఇటీవల తాను సొంతంగా ‘ఓప్ డోర్ (OppDoor)’ అనే పేరుతో ఈ-కామర్స్ వెంచర్ బిజినెస్ ప్రారంభించిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.బిన్నీ బన్సల్ రాజీనామాను (Binny Bansal Resigns) ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ-కామర్స్ బ్రాండ్ల వ్యాపారాల విస్తరణకు చేయూతనిచ్చే లక్ష్యంతో సాఫ్ట్ వేర్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్‌గా ‘ఓప్‌డోర్’ ప్రారంభించారు.
ఫ్లిప్‌కార్ట్ నుంచి పూర్తిగా వైదొలిగిన తర్వాత పిన్ కోడ్‌తో ‘ఓప్‌డోర్’ బిజినెస్ విస్తరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సంస్థలో (Flipkart) మిగిలిన తన వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించారు. కొన్నేండ్లుగా ఫ్లిప్‌కార్ట్‌లో బిన్నీ బన్సల్ సేవలను ఆ సంస్థ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి కొనియాడారు. కొత్త వ్యాపార రంగంలోకి విస్తరించడంతోపాటు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ పెరుగుదలకు చేయూత ఇచ్చినందుకు బిన్సీ బన్సల్‌కు ధన్యవాదాలు తెలిపారు. సచిన్ బన్సల్‌తో కలిసి 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించారు. తదుపరి ఫ్లిప్‌కార్ట్‌ను వాల్ మార్ట్ టేకోవర్ చేసిన తర్వాత కొన్ని నెలలకు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బిన్నీ బన్సాల్ వైదొలిగారు.