BSNL 395-Day Plan: 13 నెలల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ప్లాన్, 4జీ స్పీడ్‌తో రోజుకు 2జీబీ డేటాతో పాటు రోమింగ్ కూడా ఉచితం

ఈ మేరకు నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన పనులను కంపెనీ చక్కబెడుతోంది. ఇందులో భాగంగా 4జీ సేవల ప్రారంభానికి ముందే అదిరిపోయే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 13 నెలల వ్యాలిడిటీతో (395 రోజులు) తీసుకొచ్చిన ఈ ప్లాన్ ధర రూ. 2,399గా ఉంది.

BNSL Logo, A Person Holding Smartphone (Photo Credit: X, Pexels)

ప్రభుత్వరంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్‌ఎల్ త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన పనులను కంపెనీ చక్కబెడుతోంది. ఇందులో భాగంగా 4జీ సేవల ప్రారంభానికి ముందే అదిరిపోయే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 13 నెలల వ్యాలిడిటీతో (395 రోజులు) తీసుకొచ్చిన ఈ ప్లాన్ ధర రూ. 2,399గా ఉంది.  ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్, పెంచిన ధరలు జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటన

నెలకు రూ.200 కంటే తక్కువే పడుతున్న ఈ ఆఫర్‌లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఇక రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, ఇంకా అనేక విలువ ఆధారిత సేవలను యూజర్లు పొందవచ్చు. జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్ ఆస్ట్రోటెల్ వంటి సర్వీసులు ఉన్నాయి.అన్ని టెలికం కంపెనీలు టారిఫ్ ప్లాన్లను భారీగా పెంచిన నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ దూకుడుగా ముందుకు వెళుతోంది.