BSNL OTT Service Cinemaplus: బీఎస్‌ఎన్‌ఎల్ సంచలన ఓటీటీ ప్లాన్ ఆఫర్, రూ.49కే సినిమాప్లస్ స్టార్టర్ ప్యాక్, నెలరోజుల పాటు అన్నీ ఓటీటీలు ఉచితం
సినిమాప్లస్ (BSNL Cinemaplus) పేరిట తీసుకొచ్చిన ఈ ప్లాన్లలో జీ5 ప్రీమియం, సోనీలివ్ ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ఓటీటీల్లోని కంటెంట్‌ను వీక్షించొచ్చు.
బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తమ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం కొత్త ఓటీటీ ప్లాన్ల (OTT Plans)ను తీసుకొచ్చింది. సినిమాప్లస్ (BSNL Cinemaplus) పేరిట తీసుకొచ్చిన ఈ ప్లాన్లలో జీ5 ప్రీమియం, సోనీలివ్ ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ఓటీటీల్లోని కంటెంట్‌ను వీక్షించొచ్చు.
గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) యప్‌టీవీ స్కోప్ పేరిట ఓటీటీ కంటెంట్‌ను అందిస్తుండేది. దాంట్లో ప్రీమియం ప్యాక్ పేరిట రూ.249తో ఒకటే ప్లాన్ ఉండేది. కానీ, తాజాగా సినిమాప్లస్ (BSNL Cinemaplus) పేరిట తీసుకొచ్చిన ఓటీటీ ప్యాక్‌లో స్టార్టర్, ఫుల్, ప్రీమియం పేరిట మూడు నెలవారీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ప్లాన్‌ను బట్టి ఓటీటీ వేదికల కాంబినేషన్ మారుతూ ఉంటుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ సినిమాప్లస్ స్టార్టర్ ప్యాక్: ప్రస్తుతం ఈ ప్యాక్ రూ.49కే లభిస్తుంది. కానీ, దీని వాస్తవ ధర రూ.99. దీంట్లో షెమరూ, హంగామా, లయన్స్‌గేట్, ఎపిక్ ఆన్ ఓటీటీల్లోని కంటెంట్‌ను వీక్షించొచ్చు.
బీఎస్‌ఎన్‌ఎల్ సినిమాప్లస్ ఫుల్ ప్యాక్: ఈ ఫుల్ ప్యాక్ ధర రూ.199. దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటే నెలరోజుల పాటు జీ5 (ZEE5) ప్రీమియం, సోనీలివ్ (SonyLIV) ప్రీమియం, యప్‌టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar)లోని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ షోలను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ సినిమాప్లస్ ప్రీమియం ప్యాక్ : నెలకు రూ.249 చెల్లించి బీఎస్‌ఎన్‌ఎల్ సినిమాప్లస్ ప్రీమియం ప్యాక్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. దీంట్లో జీ5 (ZEE5) ప్రీమియం, సోనీలివ్ (SonyLIV) ప్రీమియం, యప్‌టీవీ, షెమరూ, హంగామా, లయన్స్‌గేట్, డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) ఓటీటీలోని కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.