Card Tokenization: ఒక మీ డబ్బులు, వివరాలు భద్రం, ఆన్‌లైన్ చెల్లింపుల్లో టోకెనైజేషన్ వ్యవస్థ, వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి
సైబర్ నేరాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఆర్బీఐ, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. 2022,జనవరి నెల నుంచి ఆన్‌లైన్ చెల్లింపుల్లో టోకెనైజేషన్ వ్యవస్థను ( Card Tokenization) అమలులోకి తీసుకు రాన్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. సైబర్ నేరాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఆర్బీఐ, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. 2022,జనవరి నెల నుంచి ఆన్‌లైన్ చెల్లింపుల్లో టోకెనైజేషన్ వ్యవస్థను ( Card Tokenization) అమలులోకి తీసుకు రాన్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీని ప్రకారం రానున్న కాలంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం కానున్నాయి.
ఇప్పుడు ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లలో కావాల్సిన ప్రాడక్ట్స్ ఆర్డర్ పెట్టాలంటే తప్పని సరిగా కార్డ్ డీటెయిల్స్ తో పాటు వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే త్వరలో అమలు కానున్న కొత్త పద్దతుల్లో కార్డు వివరాలు కాకుండా టోకెన్ కోడ్‌ను (Payment Tokenization) ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ ట్రాన్సాక్షన్‌లు నిర్వహించే సమయంలో మీ కార్డ్ వివరాలు ఎంటర్ చేసినప్పుడు..ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్‌వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డులకు అనుమతికోసం రిక్వెస్ట్ పంపిస్తాయి. ఇవి కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. ఇవి కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి.తర్వాత ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహిస్తే.. కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది
వీసా, మాస్టర్ కార్డ్ వంటి కార్డ్ కంపెనీలు టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్‌పీ) గా పనిచేస్తాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు టోకెన్‌లను అందించడం లేదా ఏదైనా మొబైల్ చెల్లింపులకు బాధ్యత వహిస్తాయి. టోకెన్‌తో కార్డ్ నంబర్, సీవీవీ వివరాల్ని షేర్ చేసే అవసరం ఉండదు. టోకెనైజేషన్‌తో అన్ని ప్లాట్‌ఫాంలలో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఈ ప్రక్రియ లావాదేవీ ప్రారంభించిన ప్రతిసారి యూజర్ల డేటాను షేర్ చేసే అవసరం ఉండదు. ఆన్‌లైన్ చెల్లింపులు స్పీడుగా చేసుకోవచ్చు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ టోకనైజేషన్ వ్యవస్థ సులభతరం అయినప్పటికీ దాని అమలు, భద్రత ఎంతవరకు అనేది అమల్లోకి వచ్చిన తర్వాత తెలియాల్సి ఉంటుంది.