IPL Auction 2025 Live

'Want Free Netflix Subscription': నెట్‌ఫ్లిక్స్‌ ఉచితంగా కావాలా.. అయితే మీరు ఈ ఆఫర్ వినియోగించుకోవాల్సిందే, కంపెనీ అందిస్తున్న బంపరాఫర్ ఏంటో చూద్దాం

నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.

Netflix Logo (Photo Credits: Netflix)

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ను యూజర్లు ఫ్రీగా యాక్సెస్‌ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో బంపరాఫర్‌ ను కంపెనీ అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ పోస్ట్‌ పెయిడ్‌ ఆఫర్ ప్యాక్‌ను వినియోగించుకున్న యూజర్లు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను (Want Free Netflix Subscription) వీక్షించవచ్చు. ఇందుకోసం దేశీయ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌తో జతకట్టింది.ఎయిర్‌టెల్‌ ప్రత్యేకంగా రూ.1199, రూ.1599 పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ను యూజర్లకు అందిస్తుంది. పోస్ట్‌ పెయిడ్‌ యూజర్లు ఈ ప్లాన్‌లకు (Airtel Postpaid Family Plans) అప్‌గ్రేడ్‌ అవ్వడం ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా వీక్షించడమే కాదు ఇతర అదనపు ప్రయోజనాల్ని పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ ఇన్ఫినిటీప్లాన్‌లో రూ.1199 పోస్ట్‌ పెయిడ్‌ ప్యాక్‌తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ను ( Netflix subscription) వినియోగించుకోవచ్చు. రెండు ఉచిత ఫ్యామిలీ యాడ్ ఆన్ కనెక్షన్‌తో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌, నెలకు 150జీబీ డేటాను సొంతం చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ అందిస్తున్న మరో రూ.1599 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్‌ని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు.

మళ్ళీ పెళ్లికి రెడీ అంటున్న బిల్ గేట్స్, పిల్లలకు దూరంగా ఉండడం చాలా బాధగాఉందని తెలిపిన వ్యాపార దిగ్గజం, మెలిండాను మళ్లీ పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధమని సంకేతాలు

యూజర్లు సైతం 3 ఉచిత ఫ్యామిలీ యాడ్ ఆన్ కనెక్షన్‌లను పొందవచ్చు. అపరిమిత కాలింగ్, రోజుకు ఎస్‌ఎంఎస్‌లు,నెలకు 250జీబీ డేటాతో ఇతర ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు, 6నెలల ఫ్రీ అమెజాన్ సబ్‌స్క్రిప్షన్‌, అదనపు ఖర్చు లేకుండా సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ యాక్సెస్, షా అకాడమీ లైఫ్‌టైమ్ యాక్సెస్, వింక్ (Wynk) ప్రీమియం ఓటీటీ సబ్‌ స్క్రీప్షన్‌లను పొందవచ్చు.

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో కూడిన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే

1.ముందుగా ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ లేదా ఎయిర్‌టెల్ థాంక్స్ అప్లికేషన్ ద్వారా రెండు ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో దేనికైనా అప్‌గ్రేడ్ చేయండి.

2.ఇప్పుడు, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ని ఓపెన్‌ చేసి పేజీ పైన ఉన్న 'డిస్కవర్ ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్'పై క్లిక్ చేయండి.

3.క్లిక్‌ చేస్తే కింద భాగంలో “ఎంజాయ్‌ యువర్‌ రివార్డ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను ట్యాప్‌ చేస్తే నెట్‌ఫ‍్లిక్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.

4. కాంప్లిమెంటరీ ప్లాన్‌ను యాక్సెస్ చేయడానికి నెట్‌ప్లిక్స్‌ సింబల్‌పై ట్యాప్‌ చేసి వివరాల్ని ఎంటర్‌ చేయండి

5. అంతే ఎయిర్‌టెల్‌,నెట్‌ఫ్లిక్స్‌ అందించే ఫ్రీ సబ్‌స్క్రీప్షన్‌ ఉచితంగా పొందవచ్చు.