Elon Musk: ట్విటర్ సీఈవోగా తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నా! ట్విటర్ పోల్‌పై స్పందించిన ఎలాన్ మస్క్, కానీ ఒక్క కండీషన్ అంటూ మెలిక

ఆ తర్వాత సాప్ట్‌వేర్ అండ్ సర్వర్‌ల బృందాలను నడుపుతానంటూ ట్విటర్‌లో మస్క్ పేర్కొన్నాడు. ట్విటర్ కొనుగోలు తరువాత మస్క్ పలు వివాదాలకు కేంద్ర బింధువుగా మారుతున్నారు. దీంతో ట్విటర్ తీరుతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Elon Musk and Twitter. (Photo credits Wikimedia Commons/ Twitter)

Los Angeles, DEC 21: ట్విటర్‌ను (Twitter) సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ (Elon Musk) అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ట్విటర్ సీఈఓ పదవి (Twitter CEO) నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ట్విటర్ పోల్‌లో (Twitter Poll) నెటిజన్లు ఇచ్చిన తీర్పుతో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఈఓగా వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన తరువాత నేను ఆ పదవి నుంచి వైదొలుగుతానని మస్క్ తెలిపారు. ఆ తర్వాత సాప్ట్‌వేర్ అండ్ సర్వర్‌ల బృందాలను నడుపుతానంటూ ట్విటర్‌లో మస్క్ పేర్కొన్నాడు. ట్విటర్ కొనుగోలు తరువాత మస్క్ పలు వివాదాలకు కేంద్ర బింధువుగా మారుతున్నారు. దీంతో ట్విటర్ తీరుతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈక్రమంలో ట్విటర్ లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా పోల్ నిర్వహిస్తానని మస్క్ తెలిపారు. రెండురోజుల క్రితం మస్క్ (Elon Musk) ఓ ఆసక్తికరమైన పోల్‌ను ట్విటర్‌లో పోస్టు చేశాడు. తాను ట్విటర్ అధిపతిగా కొనసాగాలా? లేక వైదొలగాలా అనే విషయంపై పోల్ చేయాలని నెటిజన్లకు సూచించారు.

Twitter Down: మరోసారి ఆగిపోయిన ట్విట్టర్‌, బ్లూటిక్‌ ప్రారంభానికి ముందు మొరాయించిన సామాజిక మాధ్యమం, అధికారికంగా స్పందించని ట్విట్టర్‌ 

ఆదివారం తెల్లవారు జామున 4.50 గంటలకు మస్క్ ఈ పోస్టు చేశారు. ఈ పోల్‌లో 57శాతం మంది నెటిజన్లు ట్విటర్ సీఈఓ పదవి నుంచి మస్క్ వైదొలగాలని ఓటువేయగా, 43శాతం మంది మాత్రమే వద్దు అని తమ అభిప్రాయం తెలిపారు. దీంతో మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతానని మస్క్ ట్విట్ చేశాడు. చీఫ్ ఎగ్జిక్యుటివ్ పదవికొ కొత్త వ్యక్తిని నియమించి ఆ తరువాత ఆ బాధ్యతల నుంచి నేను వైదొలుగుతానని మస్క్ స్పష్టం చేశారు.