New Delhi, DEC 11: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వట్టర్ (Twitter) మరోసారి మొరాయించింది. ఇవాళ సాయంత్రం ట్విట్టర్ లో మరోసారి ఎర్రర్ మెజేజ్ కనిపించింది. పలువురు యూజర్లకు పేజ్‌లు లోడ్ (Twitter down) అవ్వలేదు. సాయంత్రం 6.55 నిమిషాల నుంచి ట్విట్టర్ (Twitter down) సరిగ్గా పనిచేయడం లేదంటూ పలు కంప్లైంట్లు వచ్చాయి. ఈ మేరకు డౌన్ డిటెక్టర్ లో పిర్యాదుల కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ట్విట్టర్ చాలా సార్లు మొరాయిస్తోంది. ముఖ్యంగా ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత పలుమార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక కారణాలతో ట్విట్టర్ చాలాసార్లు ఆగిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మస్క్ ట్విట్టర్ ను తీసుకున్న తర్వాత చాలా మందిని తొలగించాడు.
my twitter is acting weird or somethings really wrong with the app. about to get susd maybe
— ?????? (@nottAniket) December 11, 2022
సిబ్బంది కొరతతో పాటూ, ఇతర సాంకేతిక కారణాలతో ఇలాంటి సమస్యలు తరచూ వస్తున్నాయి. అయితే దీనిపై ట్విట్టర్ యజమాని ఎలాన్ ఎలా స్పందిస్తారో అని నెటిజన్లు (Netizens) ఆసక్తిగాఎదురుచూస్తున్నారు.
ట్విట్టర్ బ్లూటిక్ సేవలను ప్రారంభించేందుకు ఒకరోజు ముందే ఇలాంటి ఇబ్బందులు ఎదరవ్వడంపై యూజర్లలో భిన్నమైన స్పందన కనిపిస్తోంది. ట్విట్టర్‌లో సమస్యపై అధికారిక ప్రకటన కూడా రాలేదు. అయితే కేవలం భారత్‌లోనే ఇలాంటి సమస్య వచ్చిందా? లేక అన్ని దేశాల్లో ఇదే తరహా సమస్యలు ఎదురవుతున్నాయా? తెలియాల్సి ఉంది.