Flipkart Big Billion Days 2021 Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2021 సేల్, అక్టోబర్ 7 నుంచి 12 వరకు భారీ డిస్కౌంట్లు, కార్డులపై 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్
అక్టోబర్ 7 నుంచి 12 వరకు ఆరు రోజుల పాటు ఈ సేల్‌ను (Flipkart Big Billion Days 2021 Sale) నిర్వహించనున్నారు. నిజానికి సెప్టెంబర్ 24 నుంచే సేల్ ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చినా.. అక్టోబర్ 7 నుంచి (Goes Live on October 7) సేల్ నిర్వహిస్తున్నామని.. ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2021 సేల్ అధికారిక డేట్ వచ్చేసింది. అక్టోబర్ 7 నుంచి 12 వరకు ఆరు రోజుల పాటు ఈ సేల్‌ను (Flipkart Big Billion Days 2021 Sale) నిర్వహించనున్నారు. నిజానికి సెప్టెంబర్ 24 నుంచే సేల్ ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చినా.. అక్టోబర్ 7 నుంచి (Goes Live on October 7) సేల్ నిర్వహిస్తున్నామని.. ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అక్టోబర్‌లో వచ్చే దసరా పండుగ సందర్భంగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు పోటీగా ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్, నాన్ ప్లస్ మెంబర్స్, సూపర్ కాయిన్స్‌ను రీడిమ్ చేసుకొని కూడా ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. మొబైల్ ఫోన్స్‌తో పాటు.. లాప్‌టాప్స్, స్మార్ట్‌వాచెస్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌టీవీ, టాబ్లెట్స్ మీద ఈసేల్‌లో భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. దాదాపు 80 శాతం వరకు డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. వాటితో పాటు.. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. పేటీఎం ద్వారా కొనుగోలు చేసిన వారికి క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే.. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ముందుగానే యాక్సెస్ ఉంటుంది.
మోటొరోలా, ఒప్పో, పోకో, రియల్‌మీ, సామ్‌సంగ్, వివో లాంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. వాటి మీద భారీ డిస్కౌంట్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ లాగానే.. అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021ను త్వరలో ప్రారంభించనుంది. ఇంకా సేల్స్ డేట్స్‌ను అమెజాన్ ప్రకటించలేదు.