Flipkart Big Billion Days Sale 2024 Deals: ఫ్లిప్ కార్డ్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో మరిన్ని డీల్స్ విడుదల, ఈ ఫోన్లపై ఏకంగా పదివేల వరకు తగ్గింపు, ఏయే డీల్స్ ఉన్నాయంటే?
ఈ నెల 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అవుతుంది. పాపులర్ స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది. ప్రత్యేకించి పోకో ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తోంది.
New Delhi, SEP 20: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ (Flipkart Big Billion Days Sale 2024) తేదీలు వచ్చేశాయి. ఈ నెల 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అవుతుంది. పాపులర్ స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది. ప్రత్యేకించి పోకో ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తోంది. పోకో ఎఫ్6 5జీ (Poco F6 5g), పోకో ఎక్స్6 5జీ ఫోన్ల ధరలు తగ్గాయి. వీటితోపాటు అదనంగా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు లభిస్తాయి. మ్యాడ్ రిటైల్ ప్రైస్ క్యాంపెయిన్ కింద ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో పలు ఫోన్ల ధరలు తగ్గించినట్లు పోకో తెలిపింది. ఎఫ్,ఎక్స్ఎం, సీ సిరీస్ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు అందిస్తున్నామని వెల్లడించింది. పోకో ఎఫ్6 5జీ ఫోన్ రూ.29,999 నుంచి రూ.21,999లకు, పోకో ఎక్స్ 6 ప్రో 5జీ ఫోన్ రూ.26,999 నుంచి రూ.18,999లకు తగ్గించేసింది.
అలాగే పోకో ఎక్స్6 5జీ ఫోన్ రూ.21,999 నుంచి రూ.14,999లకు, పోకో ఎక్స్6 నియో 5జీ ఫోన్ రూ.15,999 నుంచి రూ.11,999లకు లభిస్తుంది. పోకో ఎఫ్6 5జీ ఫోన్, ఇతర పోకో ఎక్స్ సిరీస్ ఫోన్లూ కూడా ఈ నెల 26 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో డిస్కౌంట్ ధరలకు లభిస్తాయి. పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ రూ.13,499 నుంచి రూ.10 వేలకు, పోకో ఎం6 5జీ ఫోన్ రూ.10,499 నుంచి రూ.7,4999లకు లభిస్తాయి. పోకో సీ65 ఫోన్ 9,499 నుంచి రూ.6,799, పోకో సీ61 ఫోన్ రూ.6,999 నుంచి రూ.6,299లకు లభిస్తాయి. ఈ నెల 27 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు సెప్టెంబర్ 26 నుంచి ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయి.