BSNL New Recharge Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి రెండు ఆకర్షణీయమైన ప్లాన్లు, తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే ప్లాన్ల వివరాలు తెలుసుకోండి

ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన కొత్త ఆఫర్లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో భాగంగా ఇటీవల మరో రెండు కొత్త ప్లాన్లను కంపెనీ విడుదల చేసింది.

BSNL New Recharge Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి రెండు ఆకర్షణీయమైన ప్లాన్లు, తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే ప్లాన్ల వివరాలు తెలుసుకోండి
BSNL all set to launch its 5G services soon(X)

ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన కొత్త ఆఫర్లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో భాగంగా ఇటీవల మరో రెండు కొత్త ప్లాన్లను కంపెనీ విడుదల చేసింది.

రూ.108, రూ.249 ధరలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లు అపరిమిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, హై-స్పీడ్ 4జీ ఇంటర్నెట్ వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్లు కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రిలయన్స్ జియో కొత్త ప్లాన్ ఇదిగో, రూ. 189 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రిలయన్స్ జియో అందించే ప్రయోజనాలపై ఓ లుక్కేసుకోండి

రూ. 108 ప్లాన్ వివరాలు..

అత్యంత చౌక అయిన రూ.108 ప్లాన్‌లో కస్టమర్లు 28 రోజుల పాటు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. నేషనల్ రోమింగ్‌‌ను కూడా ఈ ప్లాన్ కవర్ చేస్తుంది. అంతేకాదు 1 జీబీ హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనం అందుబాటులో లేదు.

రూ. 249 రీఛార్జ్ బెనిఫిట్స్..

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 45 రోజులుగా ఉంది. నేషనల్ రోమింగ్‌తో పాటు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను కూడా పొందవచ్చు. అంతేకాదు 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది.

(The above story first appeared on LatestLY on Sep 04, 2024 03:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).