Online Payments: ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నారా.. గూగుల్ అలర్ట్ మెసేజ్ చూడండి, జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించిన గూగుల్

స్మార్ట్‌‌ఫోన్‌, ఇతర డివైజ్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్‌ ముఖ్య సూచన (Google announces changes for automatic payments in India) చేసింది. గూగుల్‌ బేస్డ్‌ మంత్లీ పేమెంట్‌లు చేసే కస్టమర్లకు జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించింది.

Mobile (Photo Credit: File)

గూగుల్ తన వినియోగదారులకు అలర్ట్ న్యూస్ చేసింది. స్మార్ట్‌‌ఫోన్‌, ఇతర డివైజ్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్‌ ముఖ్య సూచన (Google announces changes for automatic payments in India) చేసింది. గూగుల్‌ బేస్డ్‌ మంత్లీ పేమెంట్‌లు చేసే కస్టమర్లకు జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించింది. ఆన్‌లైన్‌ పేమెంట్‌, క్రెడిట్‌ కార్డ్‌, ఏటీఎం చెల్లింపుల విషయంలో ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. సాధారణంగా ఒక్కసారి పేమెంట్‌ చేశాక నెలపేమెంట్‌లు చేసే టైంలో కార్డు నెంబర్‌, ఎక్స్‌పైరీ డేట్‌ అనేవి ఆటోమేటిక్‌గా కనిపిస్తుంటాయి.

కొన్ని సందర్భాల్లో సేవ్ అయిన వివరాలతో యూజర్‌ అవసరానికి తగ్గట్లు ఆటోమేటిక్‌గా పేమెంట్‌ కూడా జరిగిపోతుంటుంది. అయితే ఇకపై గూగుల్‌ సంబంధిత యాప్స్‌ విషయంలో ఇలాంటి ఫార్మట్‌ కనిపించదని గూగుల్ పేర్కొంది. ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన కార్డు స్టోరేజ్‌ రెగ్యులేషన్స్‌ను (RBI rules) అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. పేమెంట్‌ అగ్రిగ్రేటర్స్‌(PA), పేమెంట్‌ గేట్‌వేస్‌(PG) కొరకు ఆర్బీఐ ఈ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్తగా వచ్చిన ఆర్బీఐ సర్క్యులర్‌ ప్రకారం.. కార్డ్‌ జారీచేసినవాళ్లు, సంబంధిత నెట్‌వర్స్క్‌ తప్ప కార్డు వివరాల్ని(Card-on-File) ఇతర ప్లాట్‌ఫామ్స్‌ ఏవీ సేకరించడానికి వీల్లేదు.

స్మార్ట్‌‌ఫోన్‌కు బానిసై..తల్లిదండ్రులను గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్న యువకుడు, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు

గూగుల్‌ ప్లే అకౌంట్‌, గూగుల్‌ వర్క్‌ అకౌంట్‌, చివరికి గూగుల్‌క్లౌడ్‌లో రికార్డయిన వివరాలు సైతం పని చేయవు. కాబట్టి, వచ్చే ఏడాదిలోనూ అదే కార్డును ఉపయోగించుకోవాలనుకునేవాళ్లు ఎప్పటికప్పుడు కార్డు వివరాల్ని రీఎంటర్‌ చేయాల్సి ఉంటుందని గూగుల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. లేనిపక్షంలో పేమెంట్‌లు క్యాన్సిల్‌, డిక్లయిన్‌ అవుతాయని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే మన దేశంలో ఎక్కువ మంది కార్డు పేమెంట్ల ద్వారా ఎక్కువగా ఉపయోగించేది వీసా, మాస్టర్‌కార్డులే. వీటి విషయంలో మాత్రం ఊరట ఇచ్చే విషయం చెప్పింది. వీసా, మాస్టర్‌ కార్డు సంబంధిత డెబిట్‌, క్రెడిట్‌ కార్డు పేమెంట్స్‌ చేయాలనుకుంటే.. డిసెంబర్‌ 31,2021లోపు కార్డు వివరాల్ని రీ-ఎంటర్‌ చేయాలని, తప్పనిసరిగా ఏదైనా కొనుగోలు లేదా పేమెంట్‌ చేస్తే ఆ వివరాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కార్డు వివరాలు ఆటోమేటిక్‌గా కనిపించవని, కాబట్టి.. వచ్చే ఏడాది నుంచి పేమెంట్లు చేసే టైంలో మళ్లీ ఆ వివరాల్ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇక రూపే, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, డిస్కవర్‌, డైనర్స్‌ కార్డ్‌ వినియోగదారులు మాత్రం స్టోర్‌ కావని, పేమెంట్‌ చేసిన ప్రతీసారి వివరాలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది.



సంబంధిత వార్తలు

New Flight Luggage Rules: విమాన ప్రయాణీకులకు అలర్ట్..ఇకపై ఒక క్యాబిన్ బ్యాగుకు మాత్రమే అనుమతి...నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు...పూర్తి వివరాలివే

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.