IPL Auction 2025 Live

Google layoffs: గూగుల్ ఉద్యోగం నుంచి పీకేసింది, కొత్త కంపెనీ ప్రారంభిస్తున్నామని తెలిపిన పీకేసిన ఏడు మంది ఉద్యోగులు, లింక్డ్‌ ఇన్‌లో షేర్‌ చేసిన స్టోరీ వైరల్‌

గత నెలలో సుమారు 12 వేలమందిని తొలగించింది. వీరిలో గూగుల్‌ మాజీ సీనియర్‌ మేనేజర్‌ హెన్రీ కిర్క్‌ ఉన్నారు.

Google. Office (Photo Credits: IANS)

ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా గూగుల్‌ (Google layoffs) ఇటీవల ఉద్యోగులను పీకేసిన సంగతి విదితమే. గత నెలలో సుమారు 12 వేలమందిని తొలగించింది. వీరిలో గూగుల్‌ మాజీ సీనియర్‌ మేనేజర్‌ హెన్రీ కిర్క్‌ ఉన్నారు. ఇతను గూగుల్ కంపెనీ తీసేయడంతో కొత్తగా ఆలోచించాడు. ఆయనలాగే ఉద్వాసనకు గురైన కొందరి (7 People Fired By Google)తో కలిసి కంపెనీని స్థాపించాడు. తమ కొత్త ప్రయాణ విశేషాలను హెన్రీ కిర్క్‌ లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు.

ఉద్యోగులను సాగనంపుతున్న గూగుల్.. భారత్ లో 453 మంది ఇంటికి

నాకు ఇంక 52 రోజులే మిగిలి ఉంది. నాకు మీ సాయం కావాలి. కఠోర శ్రమ, ఫలితాలు మిమ్మల్ని జీవితంలో చాలా దూరం తీసుకెళతాయని నేను బలంగా విశ్వసిస్తాను. కానీ ఈ సందర్భం ఆ నమ్మకంపై సందేహాన్ని కలిగించవచ్చు. కానీ ఇలాంటి సవాళ్లు మనకు విభిన్నమైన అవకాశాలను కల్పిస్తాయి’ అని హెన్రీ పేర్కొన్నారు. తాను, 6 మంది గూగుల్‌ మాజీ ఉద్యోగులతో కలిసి న్యూయార్క్‌, శాన్‌ ఫ్రాన్సిస్కోలో డిజైన్‌ & డెవలప్‌మెంట్‌ స్టూడియోను ప్రారంభించబోతున్నామని ఆయన తెలిపారు.

ఉద్యోగులను పీకేస్తున్న గూగుల్, కంపెనీ నిర్ణయాన్ని నిరసిస్తూ స్విట్జర్లాండ్‌లో వందలాది మంది ఉద్యోగులు వాకౌట్, తీసివేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచన

ఈ పరిస్థితుల్లో ఈ పని చేయడం కఠినమైనదని, కానీ ఇది ఎంతో ఉత్కంఠభరితమైన సవాల్‌ అని అన్నారు.ముందుగా, కొన్ని ప్రాజెక్ట్‌లను పొందడం తక్షణ కర్తవ్యం. తద్వారా బిల్లులను చెల్లించడం ప్రారంభించవచ్చు. తమకు మద్దతివ్వాలంటూ పోస్ట్‌ చేశారు. దీంతో పలువురు అభినందనలు తెలిపారు.లింక్డ్‌ ఇన్‌లో షేర్‌ చేసిన వీరి స్టోరీ వైరల్‌గా మారింది.