Google Pay: గూగుల్ పేలో ఆధార్ కార్డుతో యూపీఐ పిన్‌ సెట్ చేసుకోవడం ఎలా, డెబిట్ కార్డ్ లేకుండానే ప్రాసెస్ పూర్తి చేయడం ఎలాగో తెలుసుకోండి

ఆధార్‌తో యూపీఐ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కు యూజర్లు గూగుల్‌పే యాప్‌లో నమోదు చేసుకోవచ్చు.ఈ విధానంలో గూగుల్‌పే యూజర్లు డెబిట్ కార్డ్ లేకుండానే తమ యూపీఐ పిన్‌ని సెట్ చేసుకోవచ్చు.

Google Pay (Photo Credits: Twitter)

గూగుల్‌పే యూజర్లకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి వచ్చింది. ఆధార్‌తో యూపీఐ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కు యూజర్లు గూగుల్‌పే యాప్‌లో నమోదు చేసుకోవచ్చు.ఈ విధానంలో గూగుల్‌పే యూజర్లు డెబిట్ కార్డ్ లేకుండానే తమ యూపీఐ పిన్‌ని సెట్ చేసుకోవచ్చు.

ఆధార్‌తో యూపీఐ పేమెంట్‌ అవకాశం ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే ఉండగా త్వరలో మరిన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆధార్ ద్వారా యూపీఐ చెల్లింపులను వినియోగించుకోవాలంటే ఆధార్‌, బ్యాంక్‌లో నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ ఒకటే అయి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి.

వందకి పైగా యాప్స్‌ లో ప్రమాదకరమైన వైరస్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాల్సిందే.. ఆ యాప్స్ జాబితా ఇదిగో..

ఎలా నమోదు చేసుకోవాలంటే..

గూగుల్‌పే యాప్‌లో వినియోగదారులు డెబిట్ కార్డ్ లేదా ఆధార్ ఆధారిత యూపీఐ నమోదును ఎంపిక చేసుకోవచ్చు. ఆధార్‌ని ఎంచుకుంటే నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి వారి ఆధార్ నంబర్‌లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేయాలి. ప్రామాణీకరణ దశను పూర్తి చేయడానికి ఆధార్‌ (UIDAI), బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీలను నమోదు చేయాలి. తర్వాత ప్రక్రియను బ్యాంక్‌ పూర్తి చేశాక యూపీఐ పిన్‌ని సెట్ చేసుకోవచ్చు.

google_pay_aadhaar_link

కస్టమర్‌లు లావాదేవీలు చేయడానికి లేదా బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి గూగుల్‌ యాప్‌ని ఉపయోగించవచ్చు. ఆధార్ నంబర్‌లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేసిన తర్వాత, అది ధ్రువీకరణ కోసం NPCI ద్వారా UIDAIకి వెళ్తుంది. ఈ ప్రక్రియ వినియోగదారుల ఆధార్ నంబర్ భద్రతను నిర్ధారిస్తుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే గూగుల్‌పే ఆధార్ నంబర్‌ను స్టోర్‌ చేయదు. ధ్రువీకరణ కోసం NPCIతో ఆధార్ నంబర్‌ను భాగస్వామ్యం చేయడంలో కేవలం ఫెసిలిటేటర్‌గా మాత్రమే పనిచేస్తుంది.