'Sugar Daddy' Apps Ban: వయసు మళ్లిన ధనవంతులు వాడే డేటింగ్ యాప్స్ బ్యాన్, అమ్మాయిలతో సుఖం కోసం ఉపయోగించే షుగర్ డాడీ యాప్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన గూగుల్ ప్లేస్టోర్
ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి షుగర్ డాడీ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించబోతున్నట్లు గూగుల్ ప్లేస్టోర్ స్పష్టం చేసింది. ఈ మేరకు నిర్ణయించుకున్న పాలసీల్లో షుగర్ డాడీ యాప్స్ (sugar dating apps) కూడా టార్గెట్‌గా ఉంది.
గూగుల్ లో అశ్లీల కంటెంట్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి షుగర్ డాడీ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించబోతున్నట్లు గూగుల్ ప్లేస్టోర్ స్పష్టం చేసింది. ఈ మేరకు నిర్ణయించుకున్న పాలసీల్లో షుగర్ డాడీ యాప్స్ (sugar dating apps) కూడా టార్గెట్‌గా ఉంది. ఈ యాప్స్ మొత్తం సెక్సువల్ యాక్ట్స్ (compensated sexual relationships) కిందకే వస్తాయని గూగుల్ ప్లేస్టోర్ జూన్ 29న ఓ ప్రకటన విడుదల చేసింది. సెక్సువల్ కంటెంట్ ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని గూగుల్ ప్రకటనలో తెలిపింది.
కాగా షుగర్ యాప్స్ అనేవి వయసు మళ్లిన ధనవంతులు.. డబ్బులు వెదజల్లి అమ్మాయిలతో డేటింగ్ కోసం ఉపయోగించే యాప్స్ (sugar daddy apps). అయితే ఇది ముమ్మాటికీ డేటింగ్ యాప్స్ ముసుగులో వ్యభిచారం నడిపించడమే’ అని గూగుల్ ప్లేస్టోర్ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక మూములు డేటింగ్ యాప్‌లు కూడా ఇలా అశ్లీలతను పెంపొందించేలా వ్యవహరిస్తే.. వాటి మీద కూడా బ్యాన్ తప్పదని గూగుల్ ప్లే స్టోర్ హెచ్చరించింది.
ఇక మన దేశంలో ఇప్పుడిప్పుడే వీటి క్రేజ్ పెరుగుతోంది. ఆసియా దేశాల లిస్ట్‌లో.. మన దేశంలో మూడున్నర లక్షల మంది షుగర్ డాడీలు ఉండగా, ఇండొనేషియాలో అరవై వేలమంది ఉన్నారు. ఈ యాప్‌ల్లో ‘ఎస్‌డీఎం, స్పాయిల్, షుగర్ డాడీ, షుగెర్ డాడీ’.. ఇవి ప్లేస్టోర్ ద్వారా బాగా పాపులర్ అయ్యాయి. సెక్సువల్ రిలేషన్స్ ప్రొత్సహించే ఏ యాప్స్‌ను ఉపేకక్షించబోమని స్పష్టం చేసింది గూగుల్. అయితే అనధికారిక యాప్ స్టోర్‌లలో, డౌన్‌లోడ్‌లతో షుగర్ డేటింగ్ యాప్స్ కొనసాగే అవకాశాల్లేకపోలేదు. కాగా వయసు మళ్లిన వాళ్లు.. వయసులో అమ్మాయిలతో డేటింగ్ చేయడమే షుగర్ డాడీ యాప్స్ కాన్సెప్ట్. ఇది తోడు దగ్గర నుంచి పడక సుఖం దాకా సాగుతుంది.