Over 100 Websites Banned By Modi Govt: పార్ట్ టైం జాబ్స్ పేరుతో భారీగా మోసాలు, ఏకంగా 100 వెబ్ సైట్ల‌ను నిషేదించిన భారత స‌ర్కారు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ వెబ్ సైట్ల‌ను బ్లాక్ చేసింది.

Government of India logo (PIC@ Wikimedia Commons)

New Delhi, December 06: పార్డ్ టైం జాబ్స్ పేరుతో ( Part-Time Job Frauds) ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న వంద‌కు పైగా వెబ్ సైట్ల‌ను నిషేదించింది (Government Ban) భార‌త ప్ర‌భుత్వం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ వెబ్ సైట్ల‌ను బ్లాక్ చేసింది. టాస్క్ ఆధారిత, వ్యవస్థీకృత చట్టవ్యతిరేక పెట్టుబడి సంబంధిత (Illegal Investment-Related Crimes) ఆర్థిక నేరాలకు ఈ వెబ్ సైట్లు పాల్ప‌డుతున్నాయ‌ని తెలిపింది.

 

ఈ వెబ్ సైట్లు డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్లు, మ్యూల్, అద్దె ఖాతాలను ఉపయోగిస్తూ మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు గుర్తించారు. ఇలాంటి వంద వెబ్ సైట్ల‌ను వెంట‌నే నిషేదిస్తున్న‌ట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది.