Govt Restricts Import of Laptops: భారీగా పెరగనున్న ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు కంప్యూటర్‌ల ధరలు, ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు

దీనికి సంబంధించి ఆగస్ట్ 3 న వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరిమితులు విధించిన దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో పై ఎలక్ట్రానిక్స్ వస్తువులదిగుమతికి అనుమతి ఉంటుందని పేర్కొంది.

Work From Home (Photo Credits: Pixabay)

కేంద్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు కంప్యూటర్‌ల దిగుమతిపై ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి ఆగస్ట్ 3 న వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరిమితులు విధించిన దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో పై ఎలక్ట్రానిక్స్ వస్తువులదిగుమతికి అనుమతి ఉంటుందని పేర్కొంది.బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై పరిమితులు వర్తించవు

ఈ దిగుమతులపై ఆంక్షలు తక్షణమే అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్‌లు ,అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్‌లు, సర్వర్‌ల దిగుమతులపై హెచ్‌ఎస్‌ఎన్ 8741 కింద ఈ పరిమితులు విధిస్తున్నట్టు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

110 ఇంచుల సామ్‌ సంగ్ ఎల్ఈడీ టీవీ.. ధర రూ.1,14,99,000 మాత్రమే! ఫీచర్స్ అద్భుతః

ఇక బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై ఆంక్షలు వర్తించవని మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాగేజీ నియమాలు భారత సరిహద్దులోకి ప్రవేశించే లేదా బయటికి వచ్చే ప్రతి ప్రయాణీకుడు కస్టమ్స్ నిబంధనలు పాటించాలి. అలాగే పోస్ట్ లేదా కొరియర్. దిగుమతులు వర్తించే విధంగా సుంకం చెల్లింపునకు లోబడి ఉంటాయి. అలాగే విదేశాల్లో రిపేర్ అయిన వస్తువులను తిరిగి దిగుమతి చేసుకునేందుకు సంబంధించి, వాటి రిపేర్‌కి ఇవ్వడానికి, తిరిగి తీసుకోవడానికి సంబంధించిన దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.

సెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, బెంచ్‌మార్కింగ్ ఇతర సమయాల్లో దిగుమతిదారులు దిగుమతి లైసెన్స్ అవసరం లేకుండా సరుకుకు 20 వస్తువులను తీసుకురావచ్చు. అయితే, ఈ ఐటెమ్‌లు తప్పనిసరిగా నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగింలాలి. తిరిగి విక్రయించడానికి లేదు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరిన తర్వాత, ఉత్పత్తులను నాశనం చేయాలి లేదా తిరిగి ఎగుమతి చేయాలి.