Newdelhi, Aug 4: సాధారణంగా ఇంట్లో టీవీ ధర (TV Cost) ఎంత ఉంటుంది? వేలల్లో.. మహా అయితే, రెండు మూడు లక్షలు. అయితే, సామ్ సంగ్ (Samsung) కంపెనీ ఏకంగా కోటి పైన విలువైన అల్ట్రా లగ్జరీ మైక్రో ఎల్‌ఈడీ టీవీని (LED TV) భారత్‌లో ప్రవేశ పెట్టింది. ఈ టీవీ స్క్రీన్ సైజ్ 110 ఇంచులు కాగా ధర రూ.1,14, 99,000 కావడం గమనార్హం. ఈ ఎల్‌ఈడీ టీవీలో 2.48 కోట్ల చిన్న సైజ్ ఎల్‌ఈడీలు అమర్చారు. ఈ ఎల్‌ఈడీలన్నీ ఒక్కొక్కటిగా లైట్, కలర్‌ను విడుదల చేస్తాయి. దాంతో, అత్యంత నాణ్యమైన దృశ్యాలను చూడవచ్చు. థియేటర్ ను మించిన క్లారిటీతో డాల్బీ అట్మోస్, 3డీ సౌండ్‌వంటి హై క్వాలిటీ ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి.
#Samsung introduces #India to a #TV with over ₹1 crore price taghttps://t.co/ug9haTlxi8
By @sourabhjain24 pic.twitter.com/VhYQB7HGXL
— Business Insider India🇮🇳 (@BiIndia) August 2, 2023
రెండో దృఢమైన పదార్థంతో..
ఈ టీవీలో మరో ప్రత్యేకత దాగుంది. భూమి మీద లభించే రెండో దృఢమైన పదార్థం అయిన సాఫైర్ పదార్థంతో ఈ టీవీని తయారు చేయడం అతి పెద్ద విశేషం. ఈ టీవీ ఎంపిక చేసిన తమ స్టోర్లలో లభ్యం అవుతుందని సామ్ సంగ్ తెలిపింది.