Zomato: ఓ.. అంకితా.. దయచేసి నీ మాజీ బాయ్ ఫ్రెండ్ కు ఆర్డర్ పెట్టడం ఆపేయ్!.. ట్విట్టర్‌లో జొమాటో రిక్వెస్ట్ .. నెటిజన్ల షాక్.. అసలేంటి సంగతి?

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది “అంకిత ప్లీజ్ స్టాప్ సెండింగ్ టు యువర్ ఎక్స్ ” అంటూ జొమాటో చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Zomato: ఓ.. అంకితా.. దయచేసి  నీ మాజీ బాయ్ ఫ్రెండ్ కు ఆర్డర్ పెట్టడం ఆపేయ్!.. ట్విట్టర్‌లో జొమాటో రిక్వెస్ట్ .. నెటిజన్ల షాక్.. అసలేంటి సంగతి?
zomato (Photo-Twitter)

Bhopal, Aug 4: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) చేసిన ఒక ట్వీట్ (Tweet) ప్రస్తుతం వైరల్ (Viral) గా మారింది “అంకిత ప్లీజ్ స్టాప్ సెండింగ్ టు యువర్ ఎక్స్ ” అంటూ జొమాటో చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు కథ ఏంటంటే.. భోపాల్‌కు (Bhopal) చెందిన అంకిత అనే యువతి తన మాజీ ప్రియుడికి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆమె పెట్టిన ఫుడ్ ఆర్డర్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకుంది. అయితే తీరా ఆ ఫుడ్ అక్కడకి వెళ్లాక సదరు మాజీ క్యాన్సిల్ చేశాడు. ఇలా మూడుసార్లు జరిగింది.

Hyderabad Shocker: ఒత్తైన జుట్టుతో భర్తకు అందంగా కనపడాలనుకున్న భార్య.. బ్యూటీ పార్లర్ కు పయనం.. చివరకు బట్టతలగా దర్శనం.. కాపురానికే ఎసరు.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటన.. అసలేం జరిగింది??

దీంతో జొమాటో జోక్యం చేసుకొని .. 'భోపాల్‌కు చెందిన అంకిత దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఫుడ్ పంపించడం ఆపివేయండి. అతను డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడం ఇది మూడోసారి' అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు షాక్ తినడంతో పాటు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: దొంగతనానికి వచ్చిన వాడిని చావబాదిన ఎన్నారై.. వీడియో వైరల్.. ఇన్ స్టంట్ జస్టిస్ దక్కిందంటూ నెటిజన్ల ప్రశంసలు

(The above story first appeared on LatestLY on Aug 04, 2023 10:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).