Credits: Twitter

Hyderabad, Aug 4: కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన.. ఒత్తైన జుట్టు కోసం (Hair) ఆశపడిన ఓ వివాహితకు చేదు అనుభవం మిగిలింది. బ్యూటీ పార్లర్‌ (Beauty Parlor) నిర్వాహకులు మిడిమిడి జ్ఞానంతో చేసిన పనికి అప్పటిదాకా ఉన్న జుట్టు కూడా రాలిపోయి బట్టతల (Bald Head) మిగిలింది. పుండు మీద కారం చల్లినట్టు.. అనవసరంగా జుట్టు కోల్పోయి అందవికారంగా మారిన ఆ మహిళను భర్త కూడా పుట్టింటికి పంపించేశాడు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లోని జగదీశ్ మార్కెట్ సమీపంలో నివసించే ఓ మహిళ భర్తకు అందంగా కనిపించడం కోసం మరింత ఒత్తైన జుట్టు కావాలన్న ఆశతో స్థానికంగా ఉన్న క్వీన్జ్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ వారిని సంప్రదించింది. మహిళ చెప్పిందంతా విన్న పార్లర్ సిబ్బంది ఒత్తైన జుట్టుకోసం తమదైన ట్రీట్‌మెంట్ చేశారు. దీంతో ఆమెకు భారీగా వెంట్రుకలు ఊడిపోయాయి. కంగారు పడిపోయిన మహిళ బ్యూటీపార్లర్ వారిని ఫోన్లో సంప్రదిస్తే  సమస్యను ఉచితంగా పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. మహిళకు రకరకాల నూనెలు, షాంపూలు ఇచ్చి వాడమన్నారు. తాము చెప్పినట్టు చేయగానే నెత్తిపై జుట్టుపోయి ఏకంగా బట్టతల తయారైంది.

AP Shocker: ఒంటిమిట్ట రాములోరి గుడిలో యువకుడి దారుణం.. స్నానం చేస్తున్న మహిళా భక్తుల న్యూడ్ వీడియోల రికార్డింగ్.. బాత్రూం వెంటిలేటర్ నుంచి సెల్‌ ఫోన్‌ లో రికార్డింగ్.. కేకలు వేయడంతో పరార్

కోపంతో ఊగిపోయిన భర్త

భార్య బట్టతల చూసి కోపంతో ఊగిపోయిన భర్త  ఆమెను పుట్టింటికి పంపించేశాడు. దీంతో బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, కోర్టు అనుమతి తీసుకున్నాకే మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Mexico Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 50 మీటర్ల లోతున్న లోయలో బస్సు పడి 18 మంది మృతి.. మృతుల్లో ఆరుగురు భారతీయులు.. లోయ లోతు ఎక్కువగా ఉండటంతో కష్టంగా మారిన సహాయక చర్యలు