Google Pay in Telugu: గూగుల్ పే సేవలు తెలుగులో కూడా పొందవచ్చు, ఈ సింపుల్ స్టెప్ట్స్ ద్వారా మీరు తెలుగులో గూగుల్ పే సేవలను ఉపయోగించుకోండి

దీంతో గూగుల్ పే ఎప్పటికప్పుడు తమ సేవలను (how to use google pay in telugu) విస్తరిస్తోంది. ప్రాంతీయ భాషల్లో కూడా గూగుల్ పే సేవలను విస్తరించింది. ఇప్పుడు తెలుగులో కూడా గూగుల్ పే సేవలను (Google Pay in Telugu) పొందవచ్చు

ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ వాడకం ఎక్కువై పోయింది. క్యాష్ ఇవ్వడం కన్నా నేరుగా ఆన్ లైన్ ట్రాన్సిక్షన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల్లో రద్దీ బాగా తగ్గిపోయింది. అందరూ యూపీఐ పేమెంట్స్ యాప్స్ ద్వారా బ్యాంకు సేవలను పొందుతున్నారు. ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలన్నా.. బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలన్నా సరే ఇందులో సెకన్లలో జరిగిపోతుంది. దీంతో యూపీఐ పేమెంట్స్ యాప్స్ వైపు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

అయితే యూపీఐ పేమెంట్స్ యాప్స్‌లలో గూగుల్ పేకు యూజర్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. దీంతో గూగుల్ పే ఎప్పటికప్పుడు తమ సేవలను (how to use google pay in telugu) విస్తరిస్తోంది. ప్రాంతీయ భాషల్లో కూడా గూగుల్ పే సేవలను విస్తరించింది. ఇప్పుడు తెలుగులో కూడా గూగుల్ పే సేవలను (Google Pay in Telugu) పొందవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా గూగుల్ పే యాప్ ఓపెన్ చేయాలి. అక్కడ మీ ప్రొపైల్ ఫోటో ఉన్న గుర్తు మీద ట్యాప్ చేయాలి. అనంతరం అది ఓపెన్ కాగానే సెటింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

ఎయిర్‌టెల్‌ నుంచి మూడు కొత్త ప్లాన్లు, 350కి పైగా ఛానెళ్లను ఉచితంగా వీక్షించే అవకాశం, కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల వివరాలు ఓ సారి చెక్ చేయండి

దాన్నిక్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్సన్స్ కనిపిస్తాయి. అందులో మీరు పర్సనల్ ఇన్ఫోలోకి వెళ్లాలి. అది క్లిక్ చేసిన తర్వాత అక్కడ కనిపించే లాంగ్వేజ్ ఆప్షన్ లో తెలుగును ఎంచుకోవాలి. తరువాత సేవ్ చేయగానే మీ లావాదేవీలు తెలుగులో కనిపిస్తాయి.