Income Tax Department: ఇన్ క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ త‌ప్పు చేశారంటే రూ. 10 ల‌క్ష‌లు ఫైన్

విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్లడించకుంటే రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆదివారం హెచ్చరిస్తూ.. కంప్లయన్స్‌ కం అవేర్‌నెస్‌’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Income Tax Return (Representational Image; Photo Credit: Pixabay)

Mumbai, NOV 17: ఆదాయపు పన్నుశాఖ (Income tax) పన్ను చెల్లింపుదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్లడించకుంటే రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆదివారం హెచ్చరిస్తూ.. కంప్లయన్స్‌ కం అవేర్‌నెస్‌’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్‌లో (ITR) ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని పన్ను చెల్లింపుదారులకు సూచించింది. భారతీయ పన్ను చెల్లింపుదారులు విదేశీ బ్యాంక్ ఖాతా, నగదు రూప బీమా, యాన్యుటీ కాంట్రాక్ట్, సంస్థ, వ్యాపారంలో ఆర్థిక భాగస్వామ్యం, రియల్ ఎస్టేట్, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీ వంటి ఏదైనా మూలధన ఆస్తి గురించి సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని ఆర్థికశాఖ పేర్కొంది.

iRobot Layoffs: ఆగని లేఆప్స్, 350 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న రోబోటిక్స్ కంపెనీ ఐరోబోట్ 

పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం ‘పన్ను విధించదగ్గ పరిమితి కంటే తక్కువగా’ ఉన్నప్పటికీ తమ ఐటీఆర్‌లో విదేశీ ఆస్తి (FA), విదేశీ మూలధార ఆదాయం (FSI) షెడ్యూల్‌ని తప్పనిసరిగా పూరించాలని చెప్పింది. ఐటీఆర్‌లో (ITR) విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని బహిర్గతం చేయని పక్షంలో రూ.10లక్షల జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. 2024-25కి సంబంధించి ఇప్పటికే ఐటీఆర్‌ను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు క్యాంపెయిన్‌లో భాగంగా సందేశాలు, ఈ-మెయిల్స్‌ను పంపనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) పేర్కొంది. ఐటీఆర్ (AY 2024-25)లో విదేశీ ఆస్తుల వివరాలను ఇవ్వని వారికి గుర్తు చేయడమే ఈ ప్రచారం ఉద్దేశమని పేర్కొంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31గా గడువు నిర్ణయించిన విషయం తెలిసిందే.