Instagram Down: యూజర్లకు చుక్కలు చూపిస్తున్న ఇన్‌స్టాగ్రామ్, ఫీడ్ లోడ్ అవ్వదు, స్టోరీస్ కనిపించవు, ట్విట్లర్‌లో ఇన్‌స్టాను ఆటాడుకుంటున్న నెటిజన్లు
ఈ ఉదయం నుంచి కొన్ని దేశాల్లో ఇన్‌స్టా యూజర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇన్ స్టా ఓపెన్ చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తోంది. అంతేకాదు ఇన్ స్టాలో ఫీడ్ (Insta App Not Loading) కనిపించడం లేదు. అమెరికాలో ఈ సమస్య అధికంగా ఉంది.
New Delhi, May 18: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ మరోసారి యూజర్లను (Instagram Down) ఇబ్బంది పెడుతోంది. ఈ ఉదయం నుంచి కొన్ని దేశాల్లో ఇన్‌స్టా యూజర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇన్ స్టా ఓపెన్ చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తోంది. అంతేకాదు ఇన్ స్టాలో ఫీడ్ (Insta App Not Loading) కనిపించడం లేదు. అమెరికాలో ఈ సమస్య అధికంగా ఉంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌పై యూజర్లు జోకులు వేస్తున్నారు. మార్చిలోనూ ఇన్ స్టా ఇదే తరహాలో ప్లాబ్లం క్రియేట్ చేసింది. చాలా మంది యూజర్లు లాగిన్ సమస్యతో పాటూ, ఫీడ్ స్క్రోల్ చేయడంలో సమస్యలను (Outage Hits) ఎదుర్కుంటున్నట్లు ట్వీట్లు చేస్తున్నారు.
చాలా సేపటి వరకు ఇదే విధమైన సమస్యను ఎదుర్కున్నట్లు యూజర్లు చెప్తున్నారు. అయితే అన్ని దేశాల్లో ఇన్‌స్టా ఇదే తరహాలో ఇబ్బంది పెట్టడం లేదు. కేవలం యూఎస్‌ఏతో పాటూ కొన్ని ప్రాంతాల్లోనే సమస్య అధికంగా ఉంది.