Instagram Rewards Jaipur Student: చిన్న బగ్ కనిపెట్టినందుకు రూ. 38 లక్షలు, ఇన్‌స్టాగ్రాం నుంచి అందుకున్న జైపూర్ కుర్రాడు, ఏం కనిపెట్టాడంటే..

పైగా ఈ బహుమతి ఇవ్వడానికి నాలుగు నెలలు ఆలస్యం అయిన కారణంగా మరో 4500 డాలర్లు (సుమారు రూ.3 లక్షలపైగా) అదనంగా మొత్తం రూ.38 లక్షలపైగా సొమ్ము అతని ఖాతాలో వేసింది.

Neeraj Sharma (photo credit- IANS)

ఇన్‌స్టాగ్రాం లో బగ్‌ను కనిపెట్టిన జైపూర్ స్టూడెంట్‌కు ఆ కంపెనీ అతనికి 45 వేల డాలర్లు (రూ.35 లక్షలపైగా) బహుమతి అందించింది. పైగా ఈ బహుమతి ఇవ్వడానికి నాలుగు నెలలు ఆలస్యం అయిన కారణంగా మరో 4500 డాలర్లు (సుమారు రూ.3 లక్షలపైగా) అదనంగా మొత్తం రూ.38 లక్షలపైగా సొమ్ము అతని ఖాతాలో వేసింది. కాగా అకౌంట్ వివరాలు తెలియకపోయినా కూడా మనం పోస్టు చేసే రీల్స్‌ థంబ్‌నైల్స్‌ను సులభంగా మార్చేయొచ్చని, జస్ట్ ఏ ఖాతాలో రీల్స్ అప్‌లోడ్ అయ్యాయో దాని ఐడీ తెలిస్తే చాలని నీరజ్‌ కనుక్కున్నాడు.అప్పుడే ఇన్‌స్టాగ్రాం యాజమాన్యానికి తెలియజేశాడు.

అమెరికా నుంచి ఐఫోన్ తెప్పిస్తున్నారా? అయితే మీరు మోసపోయినట్లే, ఏయే దేశాల్లో ఐఫోన్ 14 తక్కువ ధరకు వస్తుందో తెలుసా? ఇండియా కంటే ఈ దేశాల్లో ఐఫోన్ 14 చాలా తక్కువ చౌక

అతన్ని సంప్రదించిన ఇన్ స్టా యాజమాన్యం అతను చెప్పిన సమస్యను తమకు డెమో రూపంలో ఇవ్వాలని అడిగారు. అతను స్పష్టంగా ఇచ్చిన డెమో చూసి సమస్యను అంగీకరించిన యాజమాన్యం.. బగ్‌ను కనిపెట్టి లక్షలాది ఖాతాలు హ్యాక్ అవ్వకుండా కాపాడినందుకు నీరజ్‌ను మెచ్చుకుంటూ మెయిల్ పంపింది. దీంతో పాటు భారీ నజరానా ఇస్తున్నట్లు ప్రకటించింది.