Apple iPhone 13: యాపిల్ ఐఫోన్ 13 ల‌వ‌ర్స్‌కు శుభ‌వార్త‌, స్మార్ట్‌ఫోన్‌పై రూ.11,000 వరకు డిస్కౌంట్‌, అమెజాన్ లో బంపర్ ఆఫర్

ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్13 గరిష్ట రిటైల్ ధర రూ.79,900నుండి తగ్గించి రూ.74,900కు విక్రయిస్తోంది.

Apple iPhone 13 Series (Photo Credits: Apple)

అమెజాన్ యాపిల్ ఐఫోన్ 13 (iPhone 13) కొనుగోలు దారుల‌కు భారీ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్13 గరిష్ట రిటైల్ ధర రూ.79,900నుండి తగ్గించి రూ.74,900కు విక్రయిస్తోంది. అయితే వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌పై రూ.11,000 వరకు డిస్కౌంట్‌తో పాటు ఇత‌ర ఆఫ‌ర్‌ల‌ను పొంద‌వ‌చ్చు. కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో ఐఫోన్ 13 (iPhone 13)ను సొంతం చేసుకోవాల‌నుకుంటే క్యాష్‌బ్యాక్ రూపంలో రూ.6000 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఐఫోన్ ధ‌ర రూ.68,900 ఉండ‌నుంది. ఐఫోన్13,  256జీబీ వేరియంట్‌ను రూ.78,900 తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్‌ డిస్కౌంట్‌లను ఉపయోగించవచ్చు. 512జీబీ వేరియంట్‌ను రూ. 98,900 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

Corona in AP: ఏపీలో కొత్తగా 280 మందికి కరోనా, 4,709 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స

అమెజాన్ ప్రకారం వినియోగదారులు ఐఫోన్ 13 కొనుగోలు చేసిన 90రోజులలోపు వారి క్రెడిట్ కార్డ్‌లకు లేదా బ్యాంక్ అకౌంట్‌ల‌లో రూ.6వేలు జ‌మ అవుతాయి. అంతే కాకుండా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై అదనపు తగ్గింపు పొందడానికి కస్టమర్‌లు ఎక్ఛేంజ్ ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. అమెజాన్‌లో ఎక్ఛేంజ్ ఆఫ‌ర్ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌లతో సహా అన్ని మోడల్స్ కు వ‌ర్తిస్తుంద‌ని అమెజాన్ తెలిపింది. కస్టమర్‌లు తమ పాత స్మార్ట్‌ఫోన్ పై రూ.15,350 వరకు ఎక్ఛేంజ్ ఆఫ‌ర్‌ పొందవచ్చు. ఎక్ఛేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో, ఆపిల్ ఐఫోన్ 13 (iPhone 13) కూడా రూ.5000 తగ్గింపుతో రూ.74,900కి విక్రయిస్తోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలో ఇ-కామర్స్ కంపెనీ ఐఫోన్ 13 (iPhone 13) కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందడానికి కస్టమర్‌లు యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు.



సంబంధిత వార్తలు

ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ పూర్తి షెడ్యూల్‌ ఇదిగో..

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం