iQOO 3 Volcano Orange: ఐక్యూ 3 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆకర్శనీయమైన వోల్కనో ఆరెంజ్ కలర్ వేరియంట్ భారత మార్కెట్లో విడుదల; ధర, ఫీచర్లు మరియు ఇతర స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి
3,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ద్వారా కూడా గరిష్ఠంగా రూ.13,950 వరకు తగ్గింపు పొందవచ్చు....
IQOO 3 యొక్క వోల్కనో ఆరెంజ్ కలర్ వేరియంట్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉంది. గురువారం నుంచి అమ్మకాలు ప్రారంభమైనాయి, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాంటం సిల్వర్ మరియు టోర్నడో బ్లాక్ అనే మరో రెండు రంగులలో కూడా లభిస్తుంది. కొత్తగా అమ్మకాలు ప్రారంభించిన వోల్కనో ఆరెంజ్ కలర్ వేరియంట్ iQOO 3 స్మార్ట్‌ఫోన్.. ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా 8 GB RAM/ 128GB స్టోరేజ్ మరియు 12 GB RAM/ 256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇంతకుమించి మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్ విస్తరించే అవకాశం లేదు.
భారతదేశంలో ఈ ఐక్యూ 3 స్మార్ట్‌ఫోన్ ధరలు రూ. 34,990 నుండి ప్రారంభమవుతున్నాయి. ఇదే ధరకు కొత్తగా లాంచ్ చేసిన ఆరెంజ్ కలర్ వేరియంట్ 128GBలో కొనుగోలు చేయవచ్చు.
ఆఫర్ల విషయానికొస్తే, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ద్వారా కూడా గరిష్ఠంగా రూ.13,950 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 5 శాతం డిస్కౌంట్ లభించనుంది.
iQOO 3: స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు:
స్పెసిఫికేషన్ల పరంగా, iQOO 3 లో 6.44-అంగుళాల పూర్తి HD + AMOLED డిస్‌ప్లేని ఇచ్చారు. ఇది 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 రక్షణ కవచం ఇస్తున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్డ్రాగన్ 865 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది మరియు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
ఇమేజింగ్ కోసం, స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ సెన్సార్ గల క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది f / 1.8 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా మరియు 13 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో జత చేయబడింది. నాల్గవ కెమెరా పోర్ట్రెయిట్ మోడ్ కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉంది. ఇక ముందువైపు సెల్ఫీల కోసం ఎఫ్ / 2.5 ఎపర్చరుతో 16 మెగాపిక్సెల్ షూటర్ ఉంటుంది.