iQOO Z9 Lite 5G: అదిరే కెమెరాతో రూ.10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్, ఐకూ జెడ్‌9 లైట్‌ ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి

మీడియాటెక్‌ డైమెన్సిటీ ప్రాసెసర్‌, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో వస్తోంది. భారత్‌లో రూ.10వేల ధరలో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

iQOO Z9 Lite 5G Launched in India

ఐకూ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఐకూ జెడ్‌9 లైట్‌ను భారత్‌లో విడుదల చేసింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ ప్రాసెసర్‌, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో వస్తోంది. భారత్‌లో రూ.10వేల ధరలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఐకూ జెడ్‌9 లైట్‌ (iQOO Z9 Lite) 5జీ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14తో వస్తోంది. ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్‌ రంగుల్లో లభిస్తోంది.

90Hz రీఫ్రెష్‌ రేటు, 840 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో 6.57 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. వెనక f/1.8 అపెర్చర్‌తో కూడిన 50MP + 2 MP ప్రధాన కెమెరా, ముందుభాగంలో 8MPతో సెల్ఫీ కెమెరా ఇచ్చారు. వైఫై 5, బ్లూటూత్‌ 5.4, టైప్‌- సి యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.యాక్సిలరోమీటర్‌, యాంబియెంట్‌ లైట్‌ సెన్సర్‌, ప్రాగ్జిమిటీ సెన్సర్‌, ఈ-కంపాస్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ వంటి ఆప్షన్లూ ఉన్నాయి. 15W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. ఫొటో ఎడిటింగ్‌లో కొన్ని ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. శాంసంగ్ నుంచి మడతబెట్టే ఫోన్లు వచ్చేశాయి, ధర చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే, గెలాక్సి జెడ్‌ ఫోల్డ్‌6, గెలాక్సి జెడ్‌ ఫ్లిప్‌6 ఫోల్డబుల్‌ ఫోన్లపై ఓ లుక్కేసుకోండి

ఐకూ జెడ్‌9 లైట్‌ 5జీ 4GB ర్యామ్‌+ 128GB స్టోరేజ్ మోడల్‌ ప్రారంభ ధర రూ.10,499. ఇందులో 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ కూడా ఉంది. దీని ధర రూ. 11,499. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటి విక్రయాలు అమెజాన్‌తోపాటు ఐకూ వెబ్‌సైట్‌లో జూలై 20 నుంచి  ప్రారంభం కానున్నాయి.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలతో రూ. 500 అదనపు తక్షణ తగ్గింపును ఐకూ అందిస్తోంది.