ITR Refund Scam: ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా? అయితే మీరు మోసపోయే అవకాశముంది, ఆ మెసేజ్ వస్తే రిస్క్ లో పడ్డట్లే
ఈ సందర్భాన్నే సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు పొంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది.
New Delhi, AUG 16: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు (Tac returns) పూర్తయి పన్నుచెల్లింపుదారులు ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భాన్నే సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు పొంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది. మోసపూరిత కాల్స్ (ITR refund scam), పాప్-అప్ నోటిఫికేషన్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీ శాఖ సోషల్ మీడియా ద్వారా సూచించింది. ఒకవేళ అలాంటి సందేశం వచ్చినట్లయితే, అది ఐటీ శాఖ నుంచి వచ్చినదేనా అని అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
“క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర సున్నితమైన సమాచారాన్ని అభ్యర్థించే ఈమెయిల్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వవద్దు లేదా వెబ్‌సైట్‌లను సందర్శించవద్దు. పన్ను చెల్లింపుదారులను అందించిన ఈమెయిల్ చిరునామా ద్వారా మాత్రమే వారిని ఆదాయపు పన్ను శాఖ సంప్రదించవచ్చు” అని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’(ట్విటర్)లో పేర్కొంది.