Jio 5G in India: దేశంలో జియో 5జీ విప్లవం, కొత్తగా మరో నాలుగు నగరాలకు జియో 5జీ సేవలు, ఇప్పటివరకు మొత్తం 72 నగరాలకు చేరుకున్న Jio 5G సేవలు

ఇవాళ మరో నాలుగు నగరాల్లో జియో 5జీ నెట్‌వర్క్‌ను (Jio 5G in India) అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, జబల్‌పూర్‌, పంజాబ్లోని లూథియానా, పశ్చిమబెంగాల్లోని సిలిగురి నగరాల్లో ఇవాళ జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Reliance Jio. (Photo Credits: PTI)

దేశంలో వివిధ నగరాలకు జియో 5జీ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఇవాళ మరో నాలుగు నగరాల్లో జియో 5జీ నెట్‌వర్క్‌ను (Jio 5G in India) అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, జబల్‌పూర్‌, పంజాబ్లోని లూథియానా, పశ్చిమబెంగాల్లోని సిలిగురి నగరాల్లో ఇవాళ జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఇప్పటివరకు దేశంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల సంఖ్య 72కు (Jio 5G in 72 Indian Cities) చేరింది.ఈ విషయాన్ని ఇవాళ రిలయన్స్‌ జియో సంస్థ ప్రకటించింది.

రిలయన్స్ జియో గత అక్టోబర్‌ 4న తొలిసారి ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతా నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. అక్టోబర్‌ 22న నట్వారా, చెన్నై నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను లాంచ్‌ చేసింది. ఆ తర్వాత నవంబర్‌ 10న హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో 5జీ సేవలు మొదలయ్యాయి. ఆ తర్వాత రోజే గురుగ్రామ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌ నగరాల్లో జియో 5జీ సేవలు షురూ అయ్యాయి.

యూపీఐ పేమెంట్లు అదే పనిగా చేస్తున్నారా, అయితే లిమిట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు

అదేవిధంగా పుణెలో నవంబర్‌ 25న, గుజరాత్లోని 33 జిల్లాల్లో నవంబర్‌ 25న జియో 5జీ సేవలను లాంచ్‌ చేసింది. ఉజ్జయినిలో గత డిసెంబర్ 14న, కొచ్చి, గురువాయుర్‌లో డిసెంబర్‌ 20న 5జీ సేవలు మొదలయ్యాయి. ఇక ఏపీలోని తిరుమల, విజయవాడ, విశాకపట్నం, గుంటూరులో డిసెంబర్‌ 26న 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్‌, ఔరంగాబాద్‌, చండీగఢ్‌, మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్‌, ఖరార్‌, దేరబస్సీ నగరాల్లో గత డిసెంబర్‌ 28న 5జీ సేవలు మొదలయ్యాయి. డిసెంబర్‌ 29న భోపాల్‌, ఇండోర్‌లో 5జీ సేవలను ప్రారంభించారు. ఇక ఈ ఏడాదిలో తొలిసారి జనవరి 5న ఒడిశాలోని భువనేశ్వర్‌, కటక్‌ నగరాల్లో రిలయన్స్‌ జియో 5జీ సేవలను షురూ చేశారు.