Jio 5G Launch Update: రూ. 2 లక్షల కోట్ల ఖర్చుతో జియో 5జీ నెట్‌వర్క్, డిసెంబర్ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామానికి 5జీ సేవలు,దివాళీకి ఈ నగరాల్లో 5జీ సేవలు
5జీ లో మోర్ అడ్వాన్స్ వెర్షన్‌లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. దేశ మంతా హైక్వాలిటీ, హై అబార్డ్‌బుల్ 5జీ సర్వీసులను (Jio to Launch 5th Generation Mobile Network)అందించనున్నట్లు చెప్పారు
రిలయన్స్ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం)లో 5జీ నెట్ వర్క్ (Jio 5G Launch Update) గురించి అంబానీ కీలక వ‍్యాఖ్యలు చేశారు. 5జీ లో మోర్ అడ్వాన్స్ వెర్షన్‌లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. దేశ మంతా హైక్వాలిటీ, హై అబార్డ్‌బుల్ 5జీ సర్వీసులను (Jio to Launch 5th Generation Mobile Network)అందించనున్నట్లు చెప్పారు. వచ్చే రెండు నెలల్లో అంటే ఈ దివాళీకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కత‍్తాతో పాటు దేశంలో అన్నీ ప్రధాన నగరాల్లో జియో 5జీ నెట్ వర్క్‌లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
జియో 5జీ సేవల్ని విస్త్రృతంగా అంబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామ గ్రామాన జియో 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. మేడిన్ ఇండియా 5జీ నెట్ వర్క్ వినియోగంలోకి తెచ్చేందుకు మెటా, గూగుల్,మైక్రోసాఫ్ట్, ఎరిక్సిన్,నోకియా, శాంసంగ్,సిస్కో,క్వాల్కంతో భాగస్వామ్యం అవుతున్నట్లు చెప్పారు.
జియో 5జీ ప్రపంచంలోనే అత్యంత విలువైన సేవలు అందించే సంస్థగా నిలుస్తుందని చెప్పారు. భారత డిజిటల్ సేవలను అందించడంలో రిలయన్స్ ఎపుడు ముందుందని అంబానీ చెప్పారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ 4జీ సేవలు, త్వరలోనే 5జీ సేవలని తెలిపారు. దేశవ్యాప్తంగా జియో 5జీ ట్రూ సేవలకు 2 లక్షల కోట్లు రూపాయలు వెచ్చించనుందని తెలిపారు.
జియో 5జీ సేవలు 100 మిలియన్ల కుటుంబాలకు చేరాలనేది తమ లక్క్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ ముంబై , కోలకతా, చెన్నైలలో వచ్చే దీపావళికి సేవలు అందుబాటులోకి తీసుకొస్తా మన్నారు. 2023 డిసెంబరు నాటికి ప్యాన్ ఇండియా లెవల్లో 5జీ సేవలఅందిస్తామని కూడా ముఖేశ్ అంబానీ వెల్లడించారు. అలాగే జియో ఎయిర్ ఫైబర్ పేరుతో బ్రాండ్ బాండ్ సేవలను ప్రారంభిస్తామన్నారు. జియో ఆప్టిక్ ఫైబర్ విస్తీర్ణం భారతదేశం అంతటా 11 లక్షల కిలోమీటర్లుగా ఉంటుందన్నారు.
రిలయన్స్ ఎగుమతులు 75 శాతం పెరిగి 2,50,000 కోట్లకు చేరుకున్నాయని ముఖేశ్ అంబానీ తెలిపారు. గత ఏడాది 6.8 శాతంగా ఉన్న భారతదేశ సరుకుల ఎగుమతుల్లో తమ వాటా దాదాపు 8.4 శాతం అని పేర్కొన్నారు. రిలయన్స్ తన వ్యాపారాలలో ఆల్ రౌండ్ పురోగతిని కొనసాగిస్తూనే ఉంది. వార్షిక ఆదాయాలలో100 బిలియన్లను దాటిన భారతదేశపు మొదటి కార్పొరేట్ సంస్థగా నిలిచామన్నురు. రిలయన్స్ ఏకీకృత ఆదాయాలు 47 శాతం వృద్ధి చెంది రూ. 7.93 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఎబిట్టా మార్జిన్లు రూ. 1.25 లక్షల కోట్ల కీలకమైన మైలురాయిని దాటింది. వుయ్ కేర్ స్ఫూర్తితో, రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా మిలియన్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోందని అంబానీ వెల్లడించారు.