Jio Phone All-in-One Plans: జియో ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌, జియో ఫోన్ వాడేవారికి ఇది శుభవార్తే, ఒకే ప్లాన్‌లో అన్ని రకాల సేవలు, ఈ మధ్య ప్రకటించిన కొత్త ప్లాన్ల వివరాలు కూడా తెలుసుకోండి

రూ.75-రూ.185 మధ్య ప్రవేశపెట్టిన ఈ ప్లాన్లు ప్రస్తుతం ఉన్న వాటికి అదనమని కంపెనీ తెలిపింది. కాగా కొద్ది రోజుల క్రితమే స్మార్ట్‌ఫోన్‌లో జియో ఉపయోగించేవారికి ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌ను జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.

jio-phone-users-get-all-one-prepaid-plans-jiophone (Photo Credit: Official Website)

Mumbai, October 27: రిలయన్స్ జియో తమ 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.75-రూ.185 మధ్య ప్రవేశపెట్టిన ఈ ప్లాన్లు ప్రస్తుతం ఉన్న వాటికి అదనమని కంపెనీ తెలిపింది. కాగా కొద్ది రోజుల క్రితమే స్మార్ట్‌ఫోన్‌లో జియో ఉపయోగించేవారికి ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌ను జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వచ్చిన కొత్త ప్లాన్ల ద్వారా రూ.30 చెల్లిస్తే డబుల్ డేటాను పొందొచ్చు. డేటాతో పాటు వాయిస్ కాల్స్, వ్యాల్యూ యాడెడ్ సర్వీసెస్‌ను పొందొచ్చు. కేవలం రూ.75 ధర నుంచే ఈ ప్లాన్ ప్రారంభం అవుతుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్, డేటా పొందొచ్చు. ఫీచర్ ఫోన్‌లో జియో అన్‌లిమిటెడ్ సర్వీసుల్ని అందిస్తుంది.

రూ.75 ప్లాన్‌లో జియో నుంచి జియోకు అపరమిత కాల్స్ సౌకర్యం ఉండగా, జియో యేతర నెట్‌వర్క్‌లకు 500 నిమిషాల ఉచిత కాల్స్ కేటాయించింది. 50 ఎస్సెమ్మెస్‌లు, నెలకు 3జీబీ డేటా లభిస్తుంది.

రూ.125 ప్లాన్‌లో నెలకు 14జీబీ డేటా, 500 నాన్-జియో నిమిషాలు, 300 ఎస్సెమ్మెస్‌లు లభించనుండగా, రూ.155 ప్లాన్‌లో 28 జీబీ, 500 నాన్ జియో మినిట్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. రూ.185 ప్లాన్‌లో 56 జీబీ నెలవారీ డేటా, 500 నాన్-జియో మినిట్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అన్ని ప్లాన్లకు కాలపరిమితి 28 రోజులు. కాగా, జియో ఇటీవల తమ రెగ్యులర్ ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం ‘ఆల్-ఇన్-వన్’ ప్లాన్లు ప్రకటించింది. ఇందులో రూ.225, రూ.555 ప్లాన్లు ఉన్నాయి. వీటిలో రోజుకు 2జీబీ డేటా, 3,000 నాన్-జియో వాయిస్ కాలింగ్ మినిట్స్ లభిస్తాయి.

జియో ఫోన్ వినియోగదారుల కోసం తన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల ద్వారా ప్రత్యర్థుల కంటే 25 రెట్లు ఎక్కువ విలువను అందిస్తున్నామని జియయో పేర్కొంది. ఇటీవల ఇంటర్‌ కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి) చార్జీలను జియో ప్రకటించింది. దీనిపై వినియోగదారులనుంచి నిరసన వ్యక్తం కావడంతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం ఆల్‌ ఇన్‌ వన్‌ మంత్లీ ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ప్లాన్ల ద్వారా రోజుకు 2 జీబీడేటాను అందిస్తోంది. జియోయేతర మొబైల్‌ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతోపాటు ఎప్పటిలాగే జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం కూడా ఉంది.

నెలకు రూ.222తో చేసే ప్లాన్‌తో రోజుకు 2జీబీ డేటా, జియో టు జియోకు అన్ లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాలింగ్స్, ఇతర నెట్‌వర్క్‌లకు వెయ్యి నిమిషాల టాక్ టైం. అలాగే రూ.333తో రీఛార్జ్ చేయిస్తే ఇదే ఆఫర్లు 2నెలల వ్యాలిడిటీ ఉంటాయి. ఇలా రూ.111పెంచుకుంటూ పోయిన కొలదీ ఒక్కో నెల వ్యాలిడిటీ పెరుగుతూ ఉంటుంది. గతంలో 1.5జీబీ ప్యాక్ డేటాతో ఉన్న యూజర్లకు ఇదే ఆఫర్లతో కొత్త ప్యాక్ కావాలంటే అదనంగా రూ.80తో రీఛార్జ్ చేయించుకుంటే సరిపోతుంది.

కాగా ఇంటర్‌కనెక్ట్ యూజర్‌ ఛార్జీ పేరుతో నిమిషానికి రూ. 6 పైసల వసూలును ఇటీవల జియో ప్రకటించింది. అలాగే ఒక రోజు వాలిడిటీ ఉన్న రూ.19 ప్లాన్‌ను, 7రోజుల వాలిడిటీ రూ. 52ప్లాన్‌ను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా, అటు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్‌ స్పందిస్తూ తాము ఎలాంటి ఐయూసీ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది.