Jio Plans 2020: జియో నుంచి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు, జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం, కొత్త ప్లాన్ల వివరాలు ఇవే
తాజాగా ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Reliance Jio prepaid plans) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. అయితే ఈ పరిమితి అయిపోయాక ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది.
Mumbai, July 1: రిలయన్స్ జియో కొత్త పథకాలతో (Jio Plans 2020) వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Reliance Jio prepaid plans) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. అయితే ఈ పరిమితి అయిపోయాక ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది. జియో నుంచి మరో సంచలన ఆఫర్, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితం, జియో ఫైబర్ గోల్డ్, ఆపైన ప్లాన్ లో ఉన్నవారికి మాత్రమే
రిలయన్స్ జియో తన జియోఫైబర్ వినియోగదారుల కోసం ఇదివరకే ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ సెట్-టాప్ బాక్స్‌ను ఉపయోగిస్తున్న వారికి జీ 5 ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందించనుంది. మొత్తం 12 భాషల్లో, 1.25 లక్షల ఆన్-డిమాండ్ కంటెంట్ , 100 కి పైగా లైవ్టీవీ చానెల్ల ప్రీమియం కంటెంట్ మొత్తం లైబ్రరీకి యాక్సెస్ లబిస్తుంది. సిల్వర్ త్రైమాసిక, ఆపై ప్లాన్‌లలో జియో ఫైబర్ వినియోగదారులు జీ 5 ప్రీమియం కంటెంట్‌కు అర్హులు. జియో ముఖేష్ అంబానీ మ్యాజిక్, రిల్‌లోకి 58 రోజుల్లో రూ.1,68,818 కోట్ల పెట్టుబడులు, రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో ఉందన్న జియో అధినేత
ఇప్పుడు తాజాగా అందిస్తున్న కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Jio Prepaid Recharge Plans 2020) ఓ సారి పరిశీలిస్తే..
2599 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఇది వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్. ఇతర నెట్‌వర్క్‌లకు12000 నిమిషాల టాక్ టైం లభ్యం. రోజుకు 2జీబీ డేటాతోపాటు 10జీబీ డేటా బోనస్ అదనంగా అందిస్తుంది. అంటే సంవత్సరానికి మొత్తం 740 జీబీ డేటాను వాడుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు. అలాగే డిస్నీ + హాట్‌స్టార్ వార్షిక ఉచిత చందా .
2399రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఇది కూడా వార్షిక చందానే. నాన్-జియో ఎఫ్‌యూపీ 12,000 నిమిషాలు. రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభ్యం. అయితే ఈ ప్లాన్‌లో 10జీబీ అదనపు డేటాను లేదా డిస్నీ + హాట్‌స్టార్‌కు సభ్యత్వం లభించదు.
2121 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: 336 రోజుల వాటిడిటీ, నాన్-జియో ఎఫ్‌యూపీ 12,000 నిమిషాల టాక్ టైం అదిస్తుంది. రోజు 1.5 జీబీ డేటా, ఎస్‌ఎంఎస్‌లు లభ్యం.
1299 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ కూడా 336 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. ఇతర నెట్‌వర్క్‌లకు12000 నిమిషాల టాక్ టైం లభ్యం ఈ ప్లాన్‌లో 24 జీబీ డేటా, జియో టు జియో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ , రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు
4999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ లో రోజువారీ డేటా పరిమితి లేకుండా 350 జీబీ అపరిమిత డేటాను తెస్తుంది. ఇతర నెట్‌వర్క్‌లకు12000 నిమిషాల టాక్ టైం అందిస్తుంది. 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు.